Begin typing your search above and press return to search.

గర్వంగా ఉందంటున్న నాగార్జున

By:  Tupaki Desk   |   10 Sep 2016 1:30 PM GMT
గర్వంగా ఉందంటున్న నాగార్జున
X
టాలీవుడ్లో కొత్త దనానికి పెద్ద పీట వేయడంలో అక్కినేని నాగార్జున తర్వాతే ఎవరైనా. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు మొదలు ఎంతో మంది టెక్నీషియన్లను.. ఆర్టిస్టులను వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన నిర్మించిన సినిమా ‘నిర్మలా కాన్వెంట్’. ఈ సినిమా విషయంలో తనది సరైన ఛాయిసే అని.. రోషన్‌ ను హీరోగా పరిచయం చేస్తుండటం పట్ల తనకు గర్వంగా ఉందంటున్నాడు అక్కినేని నాగార్జున.

‘‘మొన్న నిర్మలా కాన్వెంట్ ఆడియో వేడుకలో రోషన్ ప్రసంగం చూశాక నాకు అతడి మీద కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. రోషన్ లో ఎంతో ప్రతిభ ఉంది. చక్కగా నటించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు. అతను ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని నమ్మకంగా చెబుతున్నా. తనను హీరోగా పరిచయం చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది’’ అని నాగార్జున అన్నాడు. ఇక రోషన్ తండ్రి శ్రీకాంత్ గురించి చెబుతూ.. ‘‘మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. మా ఇద్దరికీ చక్కటి అనుబంధం ఉంది. తనను ఓ తమ్ముడిలాగా భావిస్తా. శ్రీకాంత్ తనయుడితో నా సంస్థలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. రోషన్ ను చూసి శ్రీకాంత్ గర్వించేలా ఉంటుంది నిర్మలా కాన్వెంట్’’ అని నాగ్ అన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేసిన నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘నిర్మలా కాన్వెంట్’ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తుంది.