Begin typing your search above and press return to search.
'ఊపిరి' మూమెంటుతో ఊరిస్తున్నారు
By: Tupaki Desk | 21 March 2016 7:30 PM GMTసినిమాను ఎంత బాగా తీశాం అన్నది కాదు.. ఎంత బాగా మార్కెటింగ్ చేశాం అన్నదే ముఖ్యం. నాన్నకు ప్రేమతో సినిమాతో ఉన్నంత బ్రిలియంట్ స్ర్కీన్ ప్లే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కనిపించి ఉండకపోవచ్చు. కాకపోతే ఈ సినిమాను ఒక విలేజ్ ఫీల్ మూవీ అంటూ మొదటి నుండి నాగ్ అండ్ కో బంగర్రాజు గెటప్ లోనే ప్రమోట్ చేశారు. దాని ప్రభావం ఏంటో బాక్సాఫీస్ కలెక్షన్లలో చూశాం. కంటెంట్ క్రిటిక్స్‌కు యావరేజ్ అనిపించినా కూడా.. రిజల్టు మాత్రం వెయ్యి ఔట్ల సౌండుతో చెవుల్లో గింగిరాలు తిరిగింది. ఇప్పుడు అదే ఊపులో 'ఊపిరి' అంటూ వస్తున్నాడు నాగ్.
ఇప్పటికే ఎన్నో ప్రెస్ మీట్లు.. ఈవెంట్లు.. చేస్తూ తెలుగు అండ్ తమిళ్ లో 'ఊపిరి' సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ కల్పించాడు నాగ్. అంతే కాకుండా ఇప్పుడేమో.. ఈ సినిమా చేయడం అనేది నాకొక ఊపిరి మూమెంట్.. మరి మీ ఊపిరి మూమెంట్ ఏంటో రికార్డు చేసి నాకు ట్వీటు చేయండి అంటూ మరొక కంటెస్టు వంటిది పెట్టాడు. స్వయంగా నాగ్ రీట్వీట్ చేస్తాడంతే.. చాలామంది ఆటోమ్యాటిక్ గా ఏదో ఒక ఊపిరి మూమెంట్ ను ఖచ్చితంగా పెట్టేస్తారు. పెడుతున్నారు కూడా. ఆ లెక్కలో ఊపిరికి విపరీతమైన ప్రమోషన్ వస్తోంది. ఈ రేంజులో ఊరిస్తుంటే కంటెంట్ నార్మల్ గా ఉన్నా కూడా ఖచ్చితంగా ఓపెనింగ్స్ అదిరిపోతాయ్. కాస్త కనెక్టయితే మరో 50 కోట్ల సినిమా నాగ్ ఖాతాలో పడినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.