Begin typing your search above and press return to search.
నాగ్ చాలా కష్టపడుతున్నాడే...
By: Tupaki Desk | 3 Feb 2016 5:30 PM GMTసీనియర్ హీరోల్లో బాలయ్యే బెటర్.. నాగ్ తదుపరి సినిమాలను చేయడంలో చాలా లేట్ చేస్తున్నాడు అంటూ విపరీతమైన కామెంట్లు చేసేశాయి కొన్ని మీడియాలు. ఇవన్నీ హీరో నాగార్జునను కాస్త బాధించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కూడా ఎడతెరిపి లేకుండా కష్టపడుతున్నా కూడా.. మీడియా వారు ఎందుకు అవన్నీ గుర్తించట్లేదని ఆయన ఫీలయ్యారట.
నిజానికి ''మనం'' సినిమా 2014 మే నెలలో రిలీజ్ అయ్యింది. అయితే అప్పటికే నాగ్ తన తండ్రి అక్కినేని చనిపోవడం చాలా కుంగిపోయాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని కొత్త సినిమా మొదలెట్టాలని అనుకున్నారు. ఇంతలో జూ.ఎన్టీఆర్ కలసి వంశీ పైడిపల్లి సినిమాను మొదలెట్టడానికి రెడీ అయ్యాడు. కాని ఎన్టీఆర్ ఆ ప్రాజెక్టు నుండి పక్కకు తప్పుకోవడంతో సినిమా మొదలెట్టడం లేటయ్యింది. షూట్ మొదలయ్యాక శృతి హాసన్ హ్యాండిచ్చింది. తమన్నా జాయిన్ అయ్యేసరికి ఇంకాస్త లేటయ్యింది. ఇంతలో సొంతంగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను కూడా మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా అంతా పూర్తయ్యాక ఓ రెండు నెలలు రీ-షూట్లకే టైమ్ పట్టేసింది. అందుకే గత ఏడాది అక్టోబర్ లో రావల్సిన ''ఊపిరి'' ఇంకా రిలీజవ్వలేదు.. అలాగే ''సోగ్గాడే చిన్ని నాయనా'' 2016లో రిలీజ్ అయ్యింది. ఈ మధ్యలో నాగ్ తన కొడుకు సినిమా ''అఖిల్'' మీద ఫోకస్ పెట్టాడు అనేకంటే.. ''మీలో ఎవరు కొటీశ్వరుడు'' ఎపిసోడ్లు షూటింగ్ చేసి.. కంటిన్యూస్ గా టివి లవర్లను ఎంటర్ టైన్ చేశాడనే చెప్పాలి.
ఇంతగా సినిమా లవర్లను.. టివి ఆడియన్స్‌ను ఉల్లాసపరుస్తున్న నాగ్ ను ఎందుకండీ చీల్చి చెండాడేస్తున్నారు? సర్లేండి. ఇకపోతే ''ఊపరి'' సినిమా షూటింగ్ మరో రెండు రోజుల్లో ముగుస్తుందట. ఫిబ్రవరి 28న ఆడియో రిలీజ్ చేసి.. మార్చిలోనే సినిమాను రిలీజ్ చేసే ప్లానింగ్ కూడా ఉంది. ఇది పూర్తవ్వగానే రాఘవేంద్రరావు సినిమా.. మరో కొత్త సినిమా మొదలెడతాడట ఈ అక్కినేని హీరో. ఏదేమైనా నాగ్ చాలా కష్టపడుతున్నాడు. కాదంటారా?