Begin typing your search above and press return to search.
నాగ్ హ్యాట్రిక్.. తేలిపోయేది ఇవాళే
By: Tupaki Desk | 25 March 2016 5:01 AM GMTప్రయోగాలతోనే సినిమాని సగం హిట్ చేసేసే స్టార్ హీరో అక్కినేని నాగార్జున. ప్రస్తుతం తన కెరీర్ లోనే పీక్ స్టేజ్ ఉన్నాడీ సీనియర్ హీరో. మనం - సోగ్గాడే చిన్ని నాయన చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న నాగ్.. ఇప్పుడు ఊపిరితో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. రెండు చేతులు - కాళ్లు కదలకుండా కుర్చీలో కూర్చునే సినిమా అంతా నడిపించేసే ఓ విభిన్నమైన పాత్రతో ఆడియన్స్ ను థ్రిల్ చేయనున్నాడు నాగ్.
మనం - సోగ్గాడు చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన నాగార్జునకు.. ఊపిరి హ్యాట్రిక్ మూవీ అవుతుందనే అంచనాలున్నాయి. తను తప్పకుండా హ్యాట్రిక్ సాధిస్తాననే అంటున్నాడు నాగార్జున. సినిమాల్లో అమ్మాయిలతో రొమాన్స్ చేసే నాగ్ లాంటి అందగాడైన హీరో.. ఇలా ఓ కుర్చీకే పరిమితం అయ్యే పాత్ర చేయడం రిస్క్ అయినా.. ఇలాంటివి నాగ్ కు బాగా అలవాటు. ఈ బిలియనీర్ పాత్రకు కేర్ టేకర్ గా కోలీవుడ్ హీరో కార్తి నటించగా.. సెక్రటరీ రోల్ లో తమన్నా కనిపించనుంది.
ఫ్రెంచ్ మూవీ ది ఇన్ టచబుల్స్ కు రీమేక్ ఈ 'ఊపిరి'. పీవీపీ బ్యానర్ పై వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇమేజ్, క్రౌడ్ పుల్లింగ్ పవర్, బడ్జెట్ లిమిటేషన్స్ లతో సంబంధం లేకుండా.. ఊపిరిపై 60 కోట్లు వెచ్చించాడు నిర్మాత. తెలుగు, తమిళ రెండు భాషల్లో రిలీజ్ కానుండడంతో.. ప్రొడ్యూసర్ పీవీపీకి ఇది సేఫ్ వెంచర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు.