Begin typing your search above and press return to search.
కార్తిని చూశాకే మారానంటున్న నాగ్
By: Tupaki Desk | 5 April 2016 5:11 PM GMT‘ఊపిరి’ సినిమా తన ఆలోచనల్లో చాలా మార్పు తెచ్చిందని అంటున్నాడు అక్కినేని నాగార్జున. సినిమాలు హిట్టవుతాయి.. డబ్బులు వస్తాయి.. ఇవన్నీ మామూలే కానీ.. ‘ఊపిరి’ లాంటి సినిమాలు గౌరవం కూడా తెచ్చిపెడతాయని.. ఈ సినిమా చేస్తూ తాను ఎంతో నేర్చుకున్నానని.. విడుదల తర్వాత ఈ సినిమాకు వచ్చిన స్పందన తనకు ఇంకో పదేళ్ల పాటు పని చేసే ఉత్సాహాన్ని ఇచ్చిందని నాగ్ చెప్పాడు.
‘‘30 ఏళ్ల కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. ఎంతో కష్టపడ్డాను. కానీ ఓ దశలో సినిమాల మీద ఆసక్తి చచ్చిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి నెగెటివ్ ఆలోచనలు ఎందుకొచ్చాయో తెలియదు. కానీ ‘ఊపిరి’ చేస్తుంటే మాత్రం అన్నీ పాజిటివ్ ఆలోచనలే కలిగాయి. ఫిలిం మేకింగ్ విషయంలో కార్తి ఉత్సాహం చూస్తే నాలోనూ ఓ కొత్త ఉత్సాహం వచ్చింది. కార్తిని చూసి నేను కూడా మారాను. ఇక ఈ సినిమాకు వస్తున్న స్పందన గురించి ఎంత చెప్పినా తక్కువే.
తమిళంలో సినిమా చూసిన వాళ్లందరూ అమలకు వరుసబెట్టి ఫోన్లు చేశారు. మీ ఆయన చాలా బాగా నటించాడంటూ అభినందనలు చెప్పారు. సినిమాలు హిట్టవడం.. డబ్బులు తేవడం.. పెద్ద విషయం కాదు. కానీ దాంతో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టే సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి. ‘ఊపిరి’ మాకు అలాంటి డబుల్ ఆనందాన్నే ఇచ్చింది’’ అని ‘ఊపిరి’ తమిళ వెర్షన్ ‘తోళ’ సక్సెస్ మీట్లో నాగ్ చెప్పాడు.