Begin typing your search above and press return to search.
ప్రేమమ్ అంటే అర్థం చెప్పిన నాగ్
By: Tupaki Desk | 21 Sep 2016 7:30 AM GMTప్రేమమ్.. కొంచెం కొత్తగా వినిపించింది ఈ సౌండింగ్. మలయాళంలో ఏ ఉద్దేశంతో ఈ పేరు పెట్టారో కానీ.. తెలుగు వెర్షన్ కు కూడా అదే టైటిల్ ఫిక్స్ చేయడంతో జనాలకు అదోలా అనిపించింది. తెలుగు పేరు లాగా అనిపించలేదు. ఐతే ఈ టైటిల్ వెనుక కథేంటో అక్కినేని నాగార్జున వెల్లడించాడు. తనకు కూడా ఈ టైటిల్ అర్థమేంటో ముందు తెలియదని.. ఈ మధ్యే తెలుసుకున్నానని నాగ్ తెలిపాడు. మన భాషలన్నింటికీ మూలమైన సంస్కృతంలో ప్రేమమ్ అంటే ప్రేమ అని అర్థమని.. అందుకే ఈ సినిమాకు ఆ పేరు పెట్టారని చెప్పాడు నాగ్. ప్రేమమ్ ఆడియో వేడుకలో ఈ మాట చెప్పాడు నాగ్.
ఇక ఈ సినిమా గురించి నాగ్ చెబుతూ.. ‘‘నేను ‘గీతాంజలి’ లాంటి గొప్ప ప్రేమకథలో నటించాను. నాన్నగారు దేవదాసు.. ప్రేమాభిషేకం లాంటి లవ్ స్టోరీస్ చేశారు. ఇప్పుడు చైతూ కూడా ‘ప్రేమమ్’ లాంటి గ్రేట్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. మలయాళంలో ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్టయింది. తెలుగులో కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలోని ఎవరే పాటను చాలా రోజుల కిందటే చైతూ నాకు వినిపించాడు. అప్పట్నుంచి ప్రతి రోజూ పొద్దునే ఆ పాట వింటున్నా. అంతగా ఆ పాట నచ్చింది. ‘ప్రేమమ్’ సినిమా కోసం చైతూ పెంచిన గడ్డం చూసి.. నేను కూడా అలాగే ‘నమో వెంకటేశాయ’ కోసం పెంచాను. ఐతే నా గడ్డం చూసి ఇదే బాగుందున్నాడు’’ అని నాగ్ చెప్పాడు.