Begin typing your search above and press return to search.
రెండున్నర నెలల ముందే డేట్ ఇచ్చా
By: Tupaki Desk | 10 Jan 2016 9:57 AM GMTటాలీవుడ్ సంక్రాంతి పోటీ మహా రంజుగా ఉంది. ఈ పండుగకు నందమూరి వంశం సినిమాలు రెండింటితో పాటు నాగ్ కూడా రేసులో జాయిన్ అయ్యాడని అనుకున్నారు అంతా. సోగ్గాడే చిన్ని నాయన కారణంగా పోటీ పెరిగిందని, థియేటర్ల కొరత ఏర్పడిందని చెప్పుకున్నారు. అయితే.. నాగ్ మాత్రం దీన్ని తప్పు పడుతున్నాడు.
తన మూవీ రిలీజ్ కి సంబంధించిన డేట్ ని రెండన్నర నెలల కిందటే ఇచ్చాడట నాగ్. డిస్ట్రిబ్యూటర్స్ - బయ్యర్స్ కి ఈ మేరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి.. థియేటర్స్ కూడా బ్లాక్ చేశాడట. ఇప్పుడు పోటీ ఏర్పడినంత మాత్రాన వెనక్కు తగ్గే అవకాశం లేదని, అందుకే ఇచ్చిన రిలీజ్ డేట్ కి ఫిక్స్ అయ్యానన్నాడు అక్కినేని హీరో. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బోలెడు కొత్త సంగతులు కూడా చెబుతున్నాడు. ఈ మూవీలో రమ్యకృష్ణకు చాలా స్ట్రాంగ్ కేరక్టర్ ఉంటుందని, కుర్ర జంటకు భిన్నంగా వీళ్లిద్దరూ రొమాంటిక్ కపుల్ అన్నాడు నాగ్.
లావణ్య త్రిపాఠిని రాము పాత్రకి భార్యగా ఎంపిక చేయడంలో బోలెడు జాగ్రత్తలు తీసుకన్నారట. వీటితోపాటు ప్రస్తుతం సిటీ బేస్డ్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయని, ఇలాంటి సమయంలో పల్లెటూరి వాతావరణంతో నడిచే కథ కోసం.. డ్రసింగ్ - డైలాగ్స్ విషయంలో చాలానే రీసెర్చ్ చేశారట. సంక్రాంతికి వస్తున్న సోగ్గాడే చిన్ని నాయన.. ఓ పండుగ లాంటి సినిమా అని, సక్సెస్ విషయంలో ఏమాత్రం టెన్షన్ లేదన్నాడు అక్కినేని నాగార్జున.