Begin typing your search above and press return to search.
నాగార్జున ఇలా చెప్పేశాడేంటి?
By: Tupaki Desk | 11 Jan 2016 7:19 AM GMTమంచి క్రేజున్న తెలుగు సినిమాను బాక్సాఫీస్ దగ్గర పోటీ లేకుంటే దాదాపు 1500 థియేటర్లలో రిలీజ్ చేసేస్తున్నారు ఈ రోజుల్లో. ఐతే నాగార్జున మాత్రం గొప్పలకు పోకుండా తన సినిమాను సాధారణంగా 600 థియేటర్లలో రిలీజ్ చేస్తారని వెల్లడించారు. మీడియం రేంజి హీరోల సినిమాల్ని కూడా ఒక్కోసారి వెయ్యి థియేటర్లలో రిలీజ్ చేసేస్తుంటే నాగ్ మాత్రం ఈ 600 లెక్క చెప్పడం విశేషం. సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ను ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారని అడగ్గా.. ‘‘సాధారణంగా నా సినిమా 600 థియేటర్లలో రిలీజ్ చేస్తుంటాం. సోగ్గాడే..కు 500 థియేటర్ల దాకా దొరికాయి. ఇంకొన్ని కూడా వచ్చేట్లున్నాయి’’ అని నాగ్ వెల్లడించాడు.
ఇంత పోటీలోనూ ‘సోగ్గాడే చిన్నినాయనా’ను సంక్రాంతికే విడుదల చేయాలనుకోవడం గురించి మాట్లాడుతూ.. ‘‘రెండున్నర నెలల కిందటే సంక్రాంతి రిలీజ్ అని ఫిక్సయ్యాం. థియేటర్లు కూడా బుక్ చేశాం. పెద్ద సిటీలు, టౌన్స్ లో థియేట్లు బుక్ అయ్యాయి. ఒకటి రెండు థియేటర్లుండే చిన్న చిన్న సెంటర్ల సంగతి వదిలేశాం. ఇప్పుడా ప్రాంతాల్లో థియేటర్లు దొరక్కపోతే.. వారం ఆలస్యంగా అయినా రిలీజ్ చేస్తాం. ఐతే ఎప్పుడొచ్చినా ఈ సినిమాను జనాలు ఆదరిస్తారని నా నమ్మకం’’ అని నాగ్ తెలిపాడు. సంక్రాంతికి ఇంటిల్లి పాదినీ అలరించే సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ అని, ప్రేక్షకులు తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నాగ్ ధీమా వ్యక్తం చేశాడు. సోగ్గాడే.. కథను ముందే చెప్పేయడం గురించి చెబుతూ.. ‘‘ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేయడానికే ఇలా చేశాం. ఇందులో హీరో చనిపోతాడు, ఆత్మగా వస్తాడు.. నేరుగా సినిమాలో ఇది చూసి ఇంకోలా ఫీలవ్వకూడదనే కథ ముందే చెప్పేశాం’’ అని నాగ్ అన్నాడు.