Begin typing your search above and press return to search.

నేనెందుకు తగ్గాలంటున్న నాగ్

By:  Tupaki Desk   |   12 Jan 2016 1:30 PM GMT
నేనెందుకు తగ్గాలంటున్న నాగ్
X
ఈ సారి సంక్రాంతి పండుగకు నాలుగు సినిమాలు రిలీజ్ కానుండడంతో.. చాలామంది వర్రీ అవుతున్నారు. సినిమా సక్సెస్ పై ఎవరి అంచనాలు వారికి ఉన్నా.. వచ్చే ఆదాయాలపై మాత్రం బెంగ పెట్టేసుకున్నారు అందరూ. అయితే.. ఎవరూ దీనిపై బైటపడ్డం లేదు, అలాగే ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. దీనిపై అక్కినేని హీరో నాగార్జును అడిగితే ఆయన ఇచ్చిన డీటైల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

'ఈ తరహా పోటీ అనారోగ్యకరమైనదే. ఎవరికీ మంచిది కాదు. కలెక్షన్స్ ను అందరూ పంచుకోవాల్సి వస్తుంది. అయితే.. ఈ రిలీజ్ డేట్ పై నేను 3 నెలల ముందే డేట్ ఇచ్చాను. అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేసుకున్నారు. అప్పుడే థియేటర్లను బ్లాక్ చేసుకుని, అడ్వాన్సులు కూడా చెల్లించాం. అంతా రెడీ చేసుకున్నాక పోటీ ఏర్పడిందని వెనక్కి తగ్గే అవకాశం లేదు.' 'ముందునుంచీ ప్లానింగ్ తో ఉండి రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు ఇతర సినిమాలు కూడా ఇదే సీజన్ ను టార్గెట్ చేశాయి. ఆ సినిమాలు వస్తున్నాయని, నా మూవీని ఎలా వాయిదా వేసుకోగలను. ఇదే విషయం వాళ్లకి కూడా తెలియాలి కదా' అన్నారు నాగ్.

అంటే.. రేస్ విషయంలో తనకు ఇష్టం లేకపోయినా పోటీకి రెడీ అయినట్లుగా చెప్పారు నాగ్. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ సీజన్ లో వస్తున్న సినిమాల్లో అతి ఎక్కువ బడ్జెట్ నాన్నకు ప్రేమతో పై పెట్టారు. తర్వాత డిక్టేటర్ కోసం ఖర్చు చేశారు. ఈ రెండింటి తర్వాత నాగ్ సోగ్గాడికి వెచ్చించారు. పొంగల్ రిలీజ్ లలో లో బడ్జెట్ మూవీ ఎక్స్ ప్రెస్ రాజా. మరి ఈ భారీ పోటీలో.. అన్నీ సక్సెస్ సాధించినా.. సేఫ్ జోన్ లోకి రావడం అన్నిటికీ సాధ్యం కాదంటున్నారు ట్రేడ్ పండింట్స్.