Begin typing your search above and press return to search.
రీషూట్ చేశాం తప్పేంటి- నాగ్
By: Tupaki Desk | 11 Jan 2016 4:03 AM GMTపెద్ద సినిమాలకు సంబంధించి రీషూట్లు జరిగాయంటే దాని గురించి నెగెటివ్ ప్రచారం మొదలైపోతుంది. ఐతే సినిమాలో ఏదైనా తేడా వచ్చిందని గుర్తించి, రీషూట్ చేస్తే.. జాగ్రత్తగా వ్యవహరించినందుకు అభినందించాలి తప్ప నెగెటివ్ గా మాట్లాడటం సరికాదని అంటున్నాడు నాగ్. ‘సోగ్గాడే చిన్నినాయనా’ విషయంలో రీషూట్లు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించిన నాగ్.. దీని వల్ల సినిమా మరింత బాగా తయారైందని చెప్పాడు.
‘‘చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నేను నా ప్రతి సినిమాకు సంబంధించి రీషూట్ల కోసమే ఐదు రోజులు ప్రత్యేకంగా షెడ్యూల్లో కేటాయిస్తాను. ‘మనం’ సినిమాకు కూడా అలాచేశాం. సినిమాలో తప్పులు గుర్తించి ముందే రీషూట్ చేసినందుకు అభినందించాలి. ఒకసారి సినిమాను థియేటర్లలోకి వదిలేశాక.. ఇక ఏమీ చేయలేం. అలాంటిది ముందే చూసుకుని రీషూట్ చేసుకోవడంలో తప్పేముంది’’ అని ప్రశ్నించాడు నాగ్.
మరి ‘భాయ్’ సినిమాను ఎందుకు అలా వదిలేశారని అడిగితే.. అది పూర్తిగా ఎందుకు పనికి రాకుండా తయారైందని.. అందుకే కొన్ని కోట్ల నష్టానికి సిద్ధపడే సినిమాను అలాగే రిలీజ్ చేసేశామని నాగ్ చెప్పడం విశేషం. ‘అఖిల్’ విషయంలో వి.వి.వినాయక్ మీద నమ్మకంతో ముందుకెళ్లిపోయినట్లు తెలిపాడు. వినాయక్ చెప్పింది చెప్పినట్లే తీశారని.. ఆయన్ని తప్పుబట్టడానికేమీ లేదని నాగ్ చెప్పాడు.