Begin typing your search above and press return to search.
అల్లుళ్ల సంగతేంటి నాగ్?
By: Tupaki Desk | 12 Jun 2015 9:30 AM GMTఅక్కినేని నాగార్జున ప్లానింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తండ్రి నీడ నుంచి త్వరగా బయటపడిపోయి హీరోగా, నిర్మాతగా ఆయన ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందే. సీనియర్ హీరోల్లో నాగ్‌కు ఉన్నంత ప్లానింగ్ మరే హీరోకు లేదని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ట్రెండుకు తగ్గట్లు తనను తాను మార్చుకుంటూ సాగిపోయిన నాగ్.. ఇప్పుడు కొడుకులపై దృష్టిపెట్టారు. కొత్త టాలెంట్ కనిపించింటే చాలు.. వెంటనే అక్కినేని కాంపౌండులోకి తీసుకొచ్చేస్తున్నారు. స్వామిరారాతో పరిచయమైన సుధీర్ వర్మను తీసుకొచ్చి చైతూతో 'దోచేయ్' చేయించిన నాగ్.. ఇప్పుడు 'కార్తికేయ' తర్వాత చందూ మొండేటిని కొడుకు కోసం ఎంగేజ్ చేశాడు. ఇక అఖిల్ విషయంలో నాగ్ ఎంత ప్లాన్డ్‌గా ఉంటున్నాడో తెలిసిందే.
ఐతే కొడుకుల విషయంలో ఇంత శ్రద్ధ చూపిస్తున్న నాగ్.. తన మేనల్లుళ్ల సంగతే అస్సలు పట్టించుకుంటున్నట్లు లేడు. పెద్ద మేనల్లుడు సుమంత్‌ను కెరీర్ ఆరంభంలో బాగానే చూసుకున్నాడు. అతణ్ని ప్రేమకథ ద్వారా లాంచ్ చేయడమే కాదు.. ఆ తర్వాత సత్యంతో కెరీర్‌ను మళ్లీ నిలబెట్టాడు. కానీ గత కొంత కాలంగా సుమంత్ పరిస్థితి దారుణంగా ఉంది. చివరి సినిమా ఏమో గుర్రం ఎగరావచ్చు దారుణమైన ఫలితాన్నిచ్చింది. తర్వాత సినిమానే మొదలుపెట్టలేదు సుమంత్. ఆ మధ్య శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ఓ సినిమా ఆరంభమవుతున్నట్లు చెప్పాడు కానీ దాని అతీ గతీ లేదు. ఇక నాగ్ రెండో మేనల్లుడు సుశాంత్‌ను బయటి నిర్మాతలెవరూ పట్టించుకునే స్థితిలో లేరు. అతనే సొంతంగా శ్రీనాగ్ కార్పొరేషన్‌లో మూడు సినిమాలు చేశాడు. కానీ అన్నీ ఫ్లాపులే. ఇప్పుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సినిమా అంటున్నాడు కానీ.. అది కార్యరూపం దాల్చట్లేదు. సినిమాల ఎంపికలో, ప్లానింగ్‌లో పర్ఫెక్ట్‌గా ఉండే నాగ్ తన మేనల్లుళ్లనిద్దరినీ పట్టించుకున్నట్లు లేడు. సొంతంగా సినిమాలు నిర్మించకపోతే పోయాడు. కనీసం సలహాలైనా ఇచ్చి వాళ్ల కెరీర్‌ను తీర్చిదిద్దొచ్చుగా!