Begin typing your search above and press return to search.

ఊపిరి తలనొప్పి చిన్నదేం కాదు

By:  Tupaki Desk   |   23 March 2016 4:45 AM GMT
ఊపిరి తలనొప్పి చిన్నదేం కాదు
X
మొన్నామధ్యన కింగ్‌ నాగార్జున ఒక మాట చెప్పారు. ఇప్పుడు అదే మాట ఆయన్ను వెంటాడేలా ఉంది. ఏంటంటే.. 15 కోట్లతో తీసి 50 కోట్లు వసూలు చేసిన తన సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలే మన టాలీవుడ్‌ కు కావాలని.. 50 కోట్లతో తీసి 50 వస్తే ఉపయోగం ఏముందని అన్నారు. కొంతమంది హీరోల ఫ్యాన్లు మా హీరో సినిమానే నువ్వు కామెంట్‌ చేసింది అని అప్పట్లో ఫీలైనా కూడా.. ఇప్పుడు మాత్రం ఆ ఈక్వేషన్‌ డైరెక్టుగా నాగార్జునకే ఎప్లయ్‌ అవుతోంది.

ఈ శుక్రవారం 'ఊపిరి' విడుదల కానున్న సంగతి తెలిసిందే. అక్షరాలా ఈ సినిమాను తీయడానికి నిర్మాతకు 60 కోట్ల వరకు ఖర్చయ్యిందని తెలుస్తోంది. అందుకే తెలుగు అండ్‌ తమిళ్‌ బైలింగువల్‌ అంటూ రెండు చోట్లా మార్కెటింగ్‌ చేస్తూ కాస్త గట్టిగా ప్రమోషన్లు చేస్తున్నారు. మరి 60 కోట్లలో ఒక 15 వరకు శాటిలైట్‌ రైట్లు వంటివి వచ్చేస్తాయని అనుకుందాం.. కాని మిగిలిన 45 కోట్లు మాత్రం తెలుగు అండ్‌ తమిళ్‌ ధియేట్రికల్‌ కలెక్షన్‌ నుండి రావల్సింద. తమిళంలో తెలియదు కాని.. తెలుగులో మినిమం ఒక 40 కోట్లు షేర్‌ వస్తుందని నాగ్‌ అంచనా. కాకపోతే సినిమాలో మనోడు పూర్తిగా వీల్‌ ఛైర్‌ కే పరిమితం కాబట్టి.. మాస్‌ ఎలిమెంట్స్‌ ఏమీ పెద్దగా లేవు కాబట్టి.. ఎంత వసూలు చేస్తుందీ అని సాలిడ్‌ గా గెస్‌ చేయడం కష్టం.

సో.. ఊపిరి పైన వసూళ్ళ తలనొప్పి గట్టిగానే ఉంది. ప్రేక్షకులరందరినీ మెప్పించి మరి నాగ్ ఆ బర్డన్‌ ను సునాయస టార్గెట్‌ గా మార్చుకుంటాడని ఆశిద్దాం.