Begin typing your search above and press return to search.
ఊపిరి తట్టుకుంది.. తడాఖా చూపించింది
By: Tupaki Desk | 9 April 2016 5:17 AM GMT‘సర్దార్ గబ్బర్ సింగ్’ ధాటికి ‘ఊపిరి’ తట్టుకుని నిలబడగలదా అని అందరూ సందేహించారు. కానీ ఊపిరి నిలబడింది. మంచి సినిమాకు జనాలు ఇప్పటికీ పట్టం కడుతున్నారని రుజువైంది. ‘సర్దార్’ ప్రభంజనం ఆ స్థాయిలో ఉన్నా సరే.. ‘ఊపిరి’ తన పట్టు నిలుపుకుంటూ మంచి కలెక్షన్లు సాధించడం విశేషమే.
ఉదయం ‘సర్దార్’ హడావుడి కారణంగా సుదర్శన్ థియేటర్లలో ‘ఊపిరి’కి రూ.22 వేలు మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. కానీ మధ్యాహ్నం నుంచి ఈ సినిమా అనూహ్యంగా పుంజుకుని రూ.74 వేలు వసూలు చేసింది. ఫస్ట్ షోకైతే ఏకంగా హౌస్ ఫుల్ అయ్యింది. సెకండ్ షో కూడా దాదాపు హౌస్ ఫుల్లే. రూ.90 వేల దాకా వసూళ్లొచ్చాయి. ‘సర్దార్’కు డివైడ్ టాక్ రావడం ‘ఊపిరి’కి కలిసొచ్చినట్లుంది. ఆ సినిమాకు టికెట్లు దొరకని వాళ్లందరూ కూడా ‘ఊపిరి’ వైపు మళ్లినట్లున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది.
మరోవైపు ఓవర్సీస్ లో సైతం ‘ఊపిరి’ పరిస్థితి మెరుగ్గానే ఉంది. ‘సర్దార్’ వచ్చాక కూడా యుఎస్ లో 70 థియేటర్లలో ‘ఊపిరి’ ఆడుతుండటం విశేషం. ఐతే డిస్ట్రిబ్యూటర్ తెలివిగా.. టికెట్ ధరల్ని తగ్గించాడు. రెగ్యులర్ ప్రైస్ (5 డాలర్లు-10 డాలర్లు)కే టికెట్లు దొరుకుతుండటంతో జనాలు ‘ఊపిరి’ని బాగానే ఆదరిస్తున్నారు. ‘సర్దార్’ ధరలు భారీగా ఉండటం ఇక్కడ కలిసొస్తోంది. ఇప్పటికే ‘మనం’ పేరిట ఉన్న నాగ్ రికార్డు (1.54 మిలియన్ డాలర్లు)ను దాటేసింది ‘ఊపిరి’. ఈ వీకెండ్ లో కలెక్షన్లు స్టడీగా ఉంటే.. 2 మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.