Begin typing your search above and press return to search.
అడివి శేష్ సినిమాను శివతో పోల్చిన నాగ్!
By: Tupaki Desk | 9 Aug 2018 4:20 AM GMTఅడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన 'గూఢచారి' సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ మోడరన్ ఏజ్ స్పై థ్రిల్లర్ కు ఆడియన్స్ నుండే కాకుండా సెలబ్రిటీలనుండి కుడా ప్రశంసలు దక్కుతున్నాయి. రీసెంట్ గా జరిగిన 'గూఢచారి' సక్సెస్ మీట్ లో 'కింగ్' నాగార్జున 'గూఢచారి' ని ఆకాశానికి ఎత్తేశాడు.
నిన్న హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ లో నాగ్ మాట్లాడుతూ 'గూఢచారి' సినిమాను 'శివ' తో పోల్చాడు. 'శివ' 1989 లో రిలీజ్ అయిన తర్వాత ఎంతోమందిని ఇన్ స్పైర్ చేసినట్టే, 'గూఢచారి' కూడా ఇప్పుడు చాలామందిని ఇన్ స్పైర్ చేస్తుందని చెప్పడం విశేషం. అంతే కాదు అతి తక్కువ వనరులతో ఈ రకమైన అత్యుత్తమ క్వాలిటీ రాబట్టడం సాధారణ విషయం కాదని టీమ్ అందరినీ అభినందించాడు. నాగ్ ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే సినిమాలో ని స్పెషల్ షాట్స్ దగ్గరనుండి అతి చిన్న డీటెయిల్స్ వరకూ ప్రస్తావించి టీమ్ ను ఆశ్చర్యంలో ముంచాడు. సినిమాలో ప్రతి ఒక్క సీన్ తనకు నచ్చిందని నాగ్ చెప్పడం విశేషం.
అంతే కాదు.. ఈ ఏడాది మూడు హిట్సే వచ్చాయని అవి 'మహానటి'.. 'రంగస్థలం'.. మూడోది 'గూఢచారి' అన్నాడు. బాలీవుడ్ క్రిటిక్ - ట్రేడ్ అనలిస్ట్ తరణ్ అదర్శ్ 'బాహుబలి' తర్వాత అక్కడి వాళ్ళకు ఇలాంటి సినిమాలను తీయాలని గట్టిగా చెప్పాడు కదా అలాగే.. నాగ్ 'గూఢచారి' తో మిగతా సినిమాలను పోలుస్తూ "మనం ఎందుకు ఎలాంటి సినిమాలను తీయడం లేదు? మనం లేజీగా ఉన్నామా లేక ఇలాంటివి తీయడం మనకు తెలియదా?" అన్నాడు. ఏదేమైనా నాగార్జున నుండి ఈ రకమైన ప్రశంసలు అందుకోవడం 'గూఢచారి' టీమ్ ను ఆనందంలో ముంచెత్తింది. మరోవైపు, అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కిన 'చి ల సౌ' కు పోటీగా 'గూఢచారి' రిలీజ్ అయినా ఏమాత్రం పట్టించుకోకుండా ఈవిధంగా మెచ్చుకోవడం అక్కినేనివారి కే చెల్లింది!