Begin typing your search above and press return to search.
వాళ్ళిద్దరూ లైఫ్ టైం ఫ్రెండ్స్ అయ్యారట
By: Tupaki Desk | 18 March 2016 11:30 AM GMTఊపిరి అంటూ నాగార్జున - కార్తీలతో మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పై అంచనాలు చాలానే ఉన్నాయి. ఈ మూవీ తన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని, ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఉందని అంటున్నాడు వంశీ. మార్చ్ 25న భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ మూవీలో రెండు కాళ్లు - రెండు చేతులు చచ్చుబడిపోయిన వ్యక్తిగా నాగార్జున నటిస్తున్నాడు.
ఊపిరి మాతృక అయిన ఫ్రెంచ్ మూవీని రీమేక్ చేయాలని కొంత కాలం క్రితమే అనుకున్నాడట దర్శకుడు. అయితే ఐఎండీబీలో టాప్ 50లో ఉండే ఈ చిత్రాన్ని దక్షిణాదికి వీలుగా తీయడం అంత సులభం కాదని తెలుసని చెప్పాడాయన. దీనికి కారణం.. లీడ్ రోల్ చేసేందుకు ఖచ్చితంగా స్టార్ హీరో అవసరం కాగా.. ఆపాత్రను చేసేందుకు మన దగ్గర స్టార్ హీరోలు అంతగా ధైర్యం చేస్తారనే నమ్మకం లేకపోవడమే. అయితే.. నాగార్జున అయితేనే ఈ రోల్ కు న్యాయం చేస్తారనే ఉద్దేశ్యంతో అడగడం, ఆయన ఒప్పుకోవడంతో తెరకెక్కించేయడం జరిగిపోయాయి.
అలాగే ఓ స్లమ్ కుర్రాడిగా కార్తి కూడా చాలా బాగా నటించాడని.. ఒరిజినల్ మూవీ గురించి తెలిసినా, తానేం తీయబోతున్నాడో చెప్పిన తర్వాత వెంటనే యాక్సెప్ట్ చేశాడని అంటున్నాడు వంశీ పైడిపల్లి. తమిళ్ వెర్షన్ కోసమైతే కార్తి అసిస్టెంట్ డైరెక్టర్ రేంజ్ లో కష్టపడ్డాడని అంటున్నాడు. ఊపిరి చిత్రం ద్వారా తనకు నాగ్ - కార్తి లాంటి లైఫ్ టైం ఫ్రెండ్స్ దొరికారని చెబుతున్నాడు వంశీ పైడిపల్లి.