Begin typing your search above and press return to search.
నాగ్ ముందు సింపుల్ టార్గెట్
By: Tupaki Desk | 11 Oct 2017 11:33 AM GMTమిగతా స్టార్లతో పోలిస్తే అక్కినేని నాగార్జున బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. స్వయంగా నిర్మాత కూడా కావడంతో ఆయన తన మార్కెట్ చూసుకుని ఆచితూచి ఖర్చు పెట్టిస్తుంటారు. నాగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రాజు గారి గది-2’ కూడా అలాగే పరిమిత బడ్జెట్లో తెరకెక్కింది. ఈ చిత్రానికి అందుకు తగ్గట్లే బిజినెస్ కూడా చేశారు. మంచి లాభాలకు సినిమాను అమ్మారు. బయ్యర్లు కూడా మరీ పెద్ద పెట్టుబడులేమీ పెట్టాల్సిన అవసరం లేకపోయింది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.24 కోట్లకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల వరకు రూ.20.4 కోట్లకు.. మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.3.6 కోట్లకు హక్కులు అమ్మారు. నైజాం రైట్స్ రూ.7.25 కోట్లు పలకగా.. వైజాగ్ లో రూ.2.4 కోట్లకు.. రాయలసీమలో రూ.3.6 కోట్లకు.. మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.7 కోట్లకు బిజినెస్ అయింది. ఓవర్సీస్ హక్కుల్ని రూ.1.4 కోట్లకు అమ్మారు.
సినిమాపై మంచి అంచనాలే ఉండటంతో బయ్యర్లందరూ ఈజీగా సేఫ్ జోన్లోకి వచ్చేస్తారని భావిస్తున్నారు. రూ.24 కోట్లకే బ్రేక్ ఈవెన్ మార్కు ఉండటంతో నాగ్ ఈజీగా ఆ మార్కును అందుకుంటాడని భావిస్తున్నారు. దసరా సినిమాల జోరు తగ్గిపోయిన నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టీ ‘రాజు గారి గది-2’ మీదే ఉంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా రూ.30 కోట్ల షేర్ తెచ్చే అవకాశముంది. ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ నిర్మించిన ‘రాజు గారి గది-2’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.