Begin typing your search above and press return to search.
నాగార్జున ‘చి ల సౌ’ చూసి ఏమన్నాడు?
By: Tupaki Desk | 30 July 2018 8:30 AM GMTఇప్పటిదాకా హిట్టు ముఖం చూడని సుశాంత్ తో నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి ‘చి ల సౌ’ అనే సినిమా తీస్తున్నాడని తెలిసినపుడు జనాలకు ఈ కాంబినేషన్ పై ఎలాంటి ఆసక్తి కనిపించలేదు. కానీ ఈ చిత్ర ప్రోమోలు చూశాక మాత్రం అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో ఏదో ప్రత్యేకత ఉందని గుర్తించారు. పైగా అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకుని రిలీజ్ చేయడానికి ముందుకు రావడం.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి కూడా ముందుకు రావడంతో దీనిపై నమ్మకాలు పెరిగాయి. పాజిటివ్ బజ్ మధ్య సినిమా రిలీజ్ కాబోతోంది. మరి నాగార్జునకు ఈ సినిమాపై ఎలా గురి కుదిరింది.. సినిమా చూసి ఆయనేమన్నారు.. ఈ విశేషాలు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘సమంత నాకు పదేళ్లుగా మంచి స్నేహితురాలు. నా తొలి సినిమా ఆమెతోనే చేశాను. నా భార్య చిన్మయి కూడా సమంతకు క్లోజ్. చి ల సౌ చిత్రాన్ని ముందు సమంతే చూసింది. దర్శకుడిగా నా తొలి సినిమా ఫలితం ఏమవుతుందో అని నా కంటే తనే ఎక్కువ టెన్షన్ పడింది. కెరీర్ పరంగా పెద్ద రిస్క్ తీసుకున్నావు.. సినిమా బాగానే తీశావా అని నన్ను ఒక రోజు అడిగింది. వెంటనే సినిమా చూపించాను. ఆమెకు నచ్చి చైతూకు కూడా చూపించింది. అతను వెంటనే నాన్నను ఒకసారి సినిమా చూడమంటాను అన్నాడు. ఆయన సినిమా చూసి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. సినిమా చూశాక ‘నవ్వించావు.. ఏడిపించావు.. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది నాన్నా’ అన్నారు. కాంప్లిమెంట్ తో నాకు ఆస్కార్ గెలిచినంత ఆనందం కలిగింది. తమ బేనర్లో సినిమా చేయమని కూడా నాగార్జున చెప్పారు. చేస్తున్నాను’’ అని రాహుల్ తెలిపాడు.