Begin typing your search above and press return to search.
మాకు అదే ఆస్కార్ కంటే ఎక్కువ
By: Tupaki Desk | 6 Dec 2017 1:42 PM GMTమొన్నామధ్యన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు చాలా కమ్మగా ఉన్నాయంటూ.. నిర్మాత బండ్ల గణేష్.. నల్లమలుపు బుజ్జి.. అలాగే బన్నీ వాసు నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే.
అయితే అన్నింటిలోకి నిజంగానే న్యాయమైన క్రిటిసిజంగా అనిపించింది ఏంటంటే.. ''మనం'' సినిమాకు నంది అవార్డు అనేదే రాకపోవడం. ఉత్తమ చిత్రంగా ఆ సినిమాకు నంది రాలేదని చాలామంది సెలబ్రిటీలు అడిగినా కూడా.. అక్కినేని ఫ్యామిలీ మాత్రం దానిపై స్పందించలేదు. అయితే ఎట్టకేలకు నాగ్ దాని గురించి చెప్పేశారు.
హలో సినిమా విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో.. నాగ్ నంది అవార్డ్స్ కాంట్రోవర్శీపై స్పందించారు. ''మనం అనేది మాకు ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే అది నాన్నగారి ఆఖరి సినిమా. అంతేకాకుండా సినిమాను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. వారి హృదయాలను మాకు అవార్డుగా ఇచ్చారు. అంతకంటే ఏం కావాలి? మాకు అదే ఆస్కార్ కంటే ఎక్కువ. వేరే అవార్డులు మాకు అక్కర్లేదులే'' అంటూ సింపుల్ గా విమర్శిస్తూ నెక్ట్స్ క్వశ్చన్ అనేశారు అక్కినేని నాగార్జున.
ప్రభుత్వం పురస్కారం ఇస్తేనే గుర్తింపు వస్తుందా అంటే రాదనే చెప్పాలి. అలాగే ప్రభుత్వాలు జెన్యూన్ గా పురస్కారాలు ఇవ్వకపోవడం కూడా మంచిది కాదు.. అనే అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తపమవుతోంది. అయితే నాగ్ మాత్రం.. ఎవ్వరినీ క్రిటిసైజ్ చేయకుండా.. తనకు అవార్డు రాకపోయినా పర్వాలేదు అంటూ స్ర్టయిట్ పంచ్ భలే వేశారులే.