Begin typing your search above and press return to search.
నాన్న సినిమా బాగోదు అంటున్న నాగార్జున
By: Tupaki Desk | 31 May 2018 10:42 AM GMTతండ్రి గురించి.. అందులోను ఐకానిక్ పర్సనాలిటీ గురించి సినిమా తీయాలని వారసులు ఉత్సాహపడడం సహజంగా కనిపిస్తూనే ఉంటుంది. పైగా ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ కూడా నడుస్తోంది. కానీ నాగార్జున మాత్రం.. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జీవితంపై.. ఆయన బయోపిక్ పై విభిన్నంగా స్పందించారు.
ఎన్టీఆర్.. వైఎస్సార్ జీవితాలపై బయోపిక్స్ ప్రస్తుతం సెట్స్ పై ఉండడం.. మహానటి సావిత్రి జీవితంపై రూపొందిన సినిమా సక్సెస్ సాధించడంతో.. ఏఎన్నార్ బయోపిక్ గురించి కూడా బాగా డిస్కషన్స్ సాగుతున్నాయి. అయితే.. నాగార్జున మాత్రం.. తండ్రి జీవితం సినిమాగా బాగోదని తేల్చేశారు. అన్ని సినిమాల్లో హీరో.. తెలుగు తెరకు ఎన్నో నేర్పించిన అక్కినేని గురించి.. స్వయంగా ఆయన కొడుకే ఇలా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ.. నాగార్జున చెప్పిన వెర్షన్ తెలుసుకుంటే మాత్రం నిజమే అని ఒప్పుకోక తప్పదు.
ఒకరి జీవితాన్ని సినిమాగా రూపొందించాలంటే.. ఆ వ్యక్తి జీవితంలో ఎత్తు పల్లాలు అన్నీ ఉండాలంటున్న నాగ్.. ఏఎన్నార్ విషయంలో మాత్రం లైఫ్ అంతా ఫ్లాట్ గా సాగిపోయిందని అంటున్నాడు. ఎప్పుడూ శిఖరాలు అధిరోహిస్తూ.. చివరకు ప్రశాంతంగా కన్ను మూసిన ఆయన లైఫ్.. ఫ్లాట్ గా ఉంటుందని.. అందుకే సినిమాకు తగిన మెటీరియల్ ఉండదన్న నాగార్జున.. ఏఎన్నార్ బయోపిక్ అంశాన్ని ఖండించేశారు.