Begin typing your search above and press return to search.
చలపతి కామెంట్స్ ను ఖండిస్తున్నా -నాగ్
By: Tupaki Desk | 23 May 2017 7:07 AM GMT'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ప్రీ రిలీజ్ కమ్ ఆడియో లాంచ్ ఈవెంట్లో ఒక పెద్ద పెనుసంచలనమే జరిగింది. అక్కడ మాట్లాడిన సీనియర్ నటుడు చలపతిరావు.. తనకు అమ్మాయిల పట్ల ఉండే నీచ భావాన్ని ఆవిష్కరించాడు. ''అమ్మాయిలు హానికరం కాదు కాని.. పక్కలోకి పనికొస్తారు'' అంటూ చలపతి చేసిన కామెంట్ల అందరికీ టారెత్తించాయి. అసలు ఒక పెద్దాయన ఇలాంటి కామెంట్లు చేయొచ్చా?
ఒకవేళ చేసిన ఆయన వాటిపై పశ్చాత్తాపం పడకుండా సైలెంట్ గా ఉంటాడేమో కాని.. తను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఈవెంట్లో జరిగింది కాబట్టి.. నాగార్జున్ మాత్రం సైలెంటుగా ఉండదలుచుకోలేదు. అందుకే ఆయన సోషల్ మీడియా సాక్షిగా ఆ కామెంట్లను ఖండించారు. ''నేను నిజ జీవితంలోనైనా సినిమాల్లోనైనా ఆడాళ్లని చాలా గౌరవిస్తాను. చలపతిరావు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. డైనోసార్లు అనేవి ఇప్పుడు లేవు'' అంటూ తెలివిగా చురకలు వేశారు నాగార్జున. ఈరోజు ఉదయం ఆయన ఈ విషయం ట్వీట్ చేశారు.
మొత్తానికి మొన్న కమెడియన్ ఆలీ.. ఇప్పుడు చలపతిరావు.. ఇలా ఆడాళ్ళపై చీప్ కామెంట్స్ ను పాస్ చేయడం తెలుగు ఇండస్ర్టీలో ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇకపోతే నాగ్ వంటి పెద్ద స్టార్ బాధ్యాతాయుతంగా వాటిని ఖండించడం.. చెప్పుకోదగిన విషయం. మిగిలిన వారికి ఇటువంటి సద్దుద్యేశాలు ఉంటేనే బెటర్.