Begin typing your search above and press return to search.

మా ఫ్యామిలీలో సిల్లీ అండ్ స్టుపిడ్స్ లేరు

By:  Tupaki Desk   |   12 Nov 2015 3:56 PM GMT
మా ఫ్యామిలీలో సిల్లీ అండ్ స్టుపిడ్స్ లేరు
X
అక్కినేని ఫ్యామిలీలో గొడవలకు ఛాన్సు లేదు. ఇదీ నాగ్ స్టేట్ మెంట్. అఖిల్ రిలీజ్ విషయంలో నాగ్ కి - అఖిల్ కి చిన్నపాటి వాదనలు జరిగాయని.. మూవీ వాయిదా వేయించడంతో తండ్రిపై అఖిల్ అలిగాడని వార్తలొచ్చాయి. వీటిపై నాగార్జున స్పందించారు. తమ ఫ్యామిలీలో గొడవలకు ఛాన్సే లేదని తేల్చి చెప్పారు నాగ్.

'మేమిద్దరం ఎప్పుడూ కోప్పడుకోలేదు, కొట్టుకోలేదు. నేను ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా.. అసలు అలగడాలు లాంటివి మా ఫ్యామిలీలో ఉండవు. అలాంటి స్టుపిడ్ ఫ్యామిలీ కాదు మాది. అసలు ఏ రీజన్ కి కొట్టుకోవడం మా కుటుంబంలో ఉండదు' అన్నారు నాగార్జున. అలగడాలు - కొట్టుకోవడాలు లాంటివి సిల్లీ - స్టుపిడ్ ఫ్యామిలీస్ లో ఉంటాయని స్టేట్ మెంట్ ఇవ్వడం కొంచెం ఆశ్చర్యకరమే.

తమ కుటుంబంలో ఎవరికీ కోపం రాదన్న నాగార్జున.. తనైనా అప్పుడప్పుడూ కోప్పడతాడట. కానీ.. అఖిల్ కి - చైతన్యకి అసలు కోపమే రాదట. అంతటి కూల్ పర్సన్స్ వాళ్లు అంటున్నారు నాగార్జున. మీకసలు కోపమే రాదా అని వాళ్లని క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారట. ఏమైనా ఇలా స్ట్రయిట్ గా ఆన్సర్ ఇవ్వగలగడం నాగ్ ఒక్కడికే చెల్లుతుంది. ఎందుకంటే.. ఇలాంటి క్వశ్చన్స్ ఎదురైతే.. చాలామంది ఎస్కేప్ అయేందుకే ట్రై చేస్తారు. కానీ నాగార్జున మాత్రం ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా.. అని అడిగి మరీ ఆన్సర్ ఇచ్చారు. దటీజ్ నాగ్.