Begin typing your search above and press return to search.
మాంత్రికుడిగా నాగ్.. ఇంకో రెండు రోజుల్లో
By: Tupaki Desk | 25 Nov 2016 1:30 PM GMTలేటు వయసులో అద్భుతమైన ఫాంలో కొనసాగుతున్నాడు అక్కినేని నాగార్జున. మనం.. సోగ్గాడే చిన్నినాయనా.. ఊపిరి.. ఇలా రెండేళ్ల వ్యవధిలో మూడు మెమొరబుల్ హిట్లు ఇచ్చి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు నాగ్. బహుశా నాగార్జున కూడా ఈ వయసులో ఇలా రైజ్ అవుతానని ఊహించి ఉండడేమో. ఐతే తన క్రేజ్ అమాంతం పెరిగిన టైంలో ఆశ్చర్యకరంగా ‘ఓం నమో వెంకటేశాయ’ లాంటి ఆధ్యాత్మిక చిత్రం చేయడం ఆయనకే చెల్లింది. ఇంతలో ఇప్పుడు యాంకర్ టర్న్ డ్ ఓంకార్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పి మరో షాకిచ్చాడు. ఓ మలయాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కునున్న ఈ చిత్రం సైలెంటుగా సెట్స్ మీదికి వెళ్లిపోతోంది.
ఈ ఆదివారం నాడే నాగ్-ఓంకార్ సినిమా ప్రారంభోత్సవం జరిపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాగార్జునతో ‘ఊపిరి’ తీసిన పీవీపీ సినిమా లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌజ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. ఈ చిత్రంలో నాగార్జున మాంత్రికుడి పాత్ర పోషిస్తాడట. ఐతే మాంత్రికుడు అనగానే అదో రకమైన అవతారాన్ని ఊహించుకోకండి. ‘గోపాల గోపాల’లో కృష్ణుడు ఎలా అప్ డేట్ అయి కనిపించాడో.. ఇందులో మాంత్రికుడు కూడా అలాగే ఉంటాడట. తాను విన్న ఒక కథ తనకు నిద్ర పట్టనివ్వట్లేదని కొన్నాళ్ల కిందట నాగార్జున చెప్పడం గుర్తుండే ఉంటుంది. నాగ్ ఇప్పుడు చేస్తున్న కథ అదే అని సమాచారం. మలయాళం నుంచి మూల కథను తీసుకుని.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చాడట ఓంకార్. అతడి స్క్రిప్టు నాగార్జునకు బాగా నచ్చిందట. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు.. ఆదివారమే వెల్లడయ్యే అవకాశముంది. ఐతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కావడానికి కొంత సమయం పడుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/