Begin typing your search above and press return to search.
టికెట్ల ధరల కోసం సినిమాను జేబులో పెట్టుకొని కూర్చోలేం?
By: Tupaki Desk | 6 Jan 2022 7:35 AM GMTఏపీలోని సినిమా టికెట్ల మీద గడిచిన కొద్ది రోజులుగా సాగుతున్నరచ్చ తెలిసిందే. దీనిపై ఇప్పటికే చాలామంది మాట్లాడారు. సులభ్ కాంప్లెంక్స్ లో టాయిలెట్ కు వెళ్లాలంటే రూ.5 తీసుకుంటున్నారు. అలాంటిది సినిమా టికెట్ రూ.5 డిసైడ్ చేయటం ఏమిటి? అంటూ మండిపడుతున్నవాళ్లు లేకపోలేదు. పేదలకు తక్కువ ధరకు వినోదం అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని.. అందుకే తక్కువ ధరలను డిసైడ్ చేశామని ఏపీ అధికారపక్ష నేతలు సమర్థించుకుంటే.. ఒక ప్రొడక్టును తయారు చేసినోడికి దాని ధరను డిసైడ్ చేసుకునే హక్కు ఉండాలన్న వాదనలతో వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది.
ఇలాంటి సీరియస్ విషయాల్లో పెద్దగా తలదూర్చని రాంగోపాల్ వర్మ.. గడిచిన రెండు.. మూడురోజలుగా దీనిపై మాట్లాడటం.. సీరియస్ వ్యాఖ్యలు చేయటం.. ఆయన వాదనకు పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావటం తెలిసిందే. ఏమైందో ఏమో కానీ.. ప్రశ్నించే తన స్వరాన్ని టోన్ డౌన్ చేసిన వర్మ. మీరు టైమిస్తే.. నేను వచ్చి మాట్లాడతానంటూ రిక్వెస్టు చేయటంతో మంత్రి పేర్ని నాని సానుకూలంగాస్పందించి.. త్వరలో కలుద్దామంటూ ట్వీట్ చేశారు.
ఓవైపు ఇదంతా జరుగుతుంటే..మరోవైపు బుధవారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో కింగ్ నాగార్జున ఆయన కుమారుడు నాగ చైతన్య నటించిన ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ మూవీ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్.. జీ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ మూవీని సంక్రాంతి కానుకగా ఈ నెల 14న రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ ను తాము మంగళవారం ఫైనల్ అనుకున్నామని నాగ్ చెప్పారు.
ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న సినిమాటికెట్ల ధరల గురించి ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ‘‘సినిమా టికెట్ ధరల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. టికెట్ ధర తక్కువగా ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువగా వస్తాయి. టికెట్ల ధరలు పెరుగుతాయని సినిమాను జేబులో పెట్టుకుని కూర్చోలేం. నెంబర్స్ ప్రతి ఏడాది మారుతూనే ఉంటాయి. ఈ నెంబర్ గేమ్ నుంచి నేనెప్పుడో బయటకు వచ్చాను’’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తన సినిమా గురించి నాగ్ చెబితే ఫర్లేదు కానీ.. సినిమా టికెట్ల ధరలు పెరుగుతాయని.. డబ్బులు ఎక్కువగా వస్తాయని సినిమాను జేబులో పెట్టుకొని కూర్చోలేం కదా? అంటూ వేసిన పంచ్ ఎవరిని ఉద్దేశించి అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమకు చెందిన వారంతా మాట్లాడాలని వర్మ సైతం పిలుపునిచ్చిన వేళ.. అందుకు భిన్నంగా నాగ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.