Begin typing your search above and press return to search.
కోడలు పిల్ల కోసం నాగార్జున వేట..త్వరలోనే ఆ ప్రకటన?!
By: Tupaki Desk | 26 Feb 2022 8:35 AM GMTటాలీవుడ్ కింగ్, సీనియర్ స్టార్ హీరో నాగార్జున వారసులుగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అక్కినేని నాగ చైతన్య, అఖిల్ అక్కినేనిల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడో సినీ గడప తొక్కినప్పటికీ.. కెరీర్ పరంగా వీరిద్దరూ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి, 2017లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు చైతు.
కానీ, వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే తాము విడిపోతున్నామని చైతు-సామ్‌లు ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. మరోవైపు అఖిల్ 2016లో ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రీయా భూపాల్‌లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే ఈ జంట పెళ్లి పీటలెక్కకుండానే బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత అఖిల్ కెరీర్‌పైనే ఫోకస్ పెట్టాడు.
ఇక ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఒంటరి జీవితాన్నే గడుపుతుండటం వల్ల నాగార్జున ఎంతగానో బాధ పడుతున్నారట. పైగా ఎక్కడికి వెళ్లినా కుమారుల పెళ్లి గురించే అడగడంతో నాగ్ మరింతగా మదన పడిపోతున్నారట. అందుకే కొడుకులకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారట. అయితే చైతుకు ఇంకా అఫీషియల్ గా విడాకులు రాలేదు.
అందు కారణంగానే ముందు అఖిల్‌కి పెళ్లి చేసేయాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే చిన్న కోడలు పిల్ల కోసం నాగార్జున వేట మొదలుపెట్టారట. అంతేకాదు, ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయినే అక్కినేని ఇంటికి కోడలుగా తీసుకురాబోతున్నారట. ఇక అఖిల్‌కు సరిపడే అమ్మాయి దొరికితే.. త్వరలోనే ఆయన పెళ్లి ప్రకటన ఉంటుందని అంటున్నారు.