Begin typing your search above and press return to search.
అబ్బబ్బా... ఎప్పటి ఫోటో ఇది
By: Tupaki Desk | 14 March 2018 8:34 AM GMTహైదరాబాద్లో ఖరీదైన ఏరియాలలో... రద్దీ అయినా ప్రాంతాలలో జూబ్లీహిల్స్ ఒకటి. సినీరంగానికి చెందిన స్టూడియోలు సినీ తారల ఇళ్లు ఇలా ఎన్నో ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేనా ఎక్కడా అడుగు జాగా కూడా ఖాళీగా కనిపించదు. కానీ కొన్నేళ్ల క్రితం ఈ ఏరియా ఎలా ఉండేదో నాగ్ పోస్టు చేసిన ఫోటో చెప్పేస్తోంది.
ముప్పై ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు ఇప్పటి సిటీకి ఎంత తేడా ఉందో చూడండి. హైటెక్ సిటీ కేబీఆర్ పార్కు జూబ్లీ చెక్ పోస్టు కార్పొరేట్ ఆసుపత్రులు లేని కాలంలో రాళ్లు రప్పలతోనే ఉండేది జూబ్లీహిల్స్. ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక సినిమాను అప్పటి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో తీశారు. ఆనాటి ఓ ఫోటోను నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ ఫోటోలో కనిపిస్తున్న గోడ ఇప్పటి కేబీఆర్ పార్కుదే. అప్పట్లో ప్రహారీ మాత్రం కట్టి వదిలేశారు. ఒక రెండో సైడ్ ఉన్న ఖాళీ ప్రాంతంలోనే అన్నపూర్ణ స్టూడియో కట్టారు. ఇక ఆ కారు వెళ్తున్న ఆ రోడ్డు జూబ్లీ చెక్ పోస్టుకు వెళ్లే రోడ్డు. ఇప్పుడు ఇసుకేస్తే రాలనం జనంతో కట్టడాలతో ఉన్న జూబ్లీహిల్స్ అప్పట్లో ఇంత ఖాళీగా ఉండేది.
ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఆ సీన్ ఏ సినిమాలోదా అని ఆలోచిస్తున్నారు. సత్యం శివం లేదా రామకృష్ణులు సినిమాలోది కావచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నాడు. నాగార్జున కాస్త ఆ క్లారిటీ కూడా ఇస్తే బాగుంటుంది. మొత్తమ్మీద తన నాన్నగారి మీద ఉన్న ప్రేమతో ఎప్పటి ఫోలోను వెలికి తీస్తున్నాడు నాగ్. మనకు కూడా చాలా విషయాలు తెలిసేలా చేస్తున్నాడు.