Begin typing your search above and press return to search.
బిబి4: ఆ ఒక్క విషయంలో నాగార్జునకు ట్రోల్స్
By: Tupaki Desk | 22 Dec 2020 11:34 AM GMTతెలుగు బిగ్ బాస్ గత రెండు సీజన్ లకు కూడా నాగార్జున హోస్టింగ్ చేశాడు. సీజన్ 2కు నాని హోస్టింగ్ చేసిన సమయంలో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. కంటెస్టెంట్స్ లో ఎవరిని మందలించినా కూడా నాని ట్రోల్స్ కు గురి అయ్యేవాడు. దాంతో నాని బిగ్ బాస్ నా వల్ల కాదంటూ వదిలేశాడు. గత రెండు సీజన్ లకు నాగార్జున హోస్టింగ్ చేయడంతో మంచి పేరు దక్కించుకున్నాడు. మరీ దారుణమైన ట్రోల్స్ మాత్రం ఆయన ఎదుర్కోలేదు. కాని బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ సందర్బంగా ఆయన అనుకోకుండా చేసిన పనికి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఫైనల్ విన్నర్ ను ప్రకటించే సమయంలో అఖిల్ చేయి కిందకు విసిరేసి చాలా కసిగా అభిజిత్ ను విజేతగా నాగార్జున ప్రకటించాడు.
ఆ సమయంలో నాగార్జున ఇంటెన్షన్ ఏంటీ అనే విషయమై ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ట్రోల్స్ చేస్తున్నారు. అఖిల్ కంటే అభిజిత్ అంటేనే నాగార్జునకు ఇష్టం. ఆ కారణంతోనే విన్నర్ ను ప్రకటించే సమయంలో అఖిల్ చేయిని విసిరేసినట్లుగా నాగ్ ప్రవర్తించాడని కొందరు అంటున్నారు. ఈ విషయమై అఖిల్ అమ్మగారు దుర్గ కూడా స్పందించారు. నాగార్జున గారు షో మొత్తంను చాలా బాగా హోస్టింగ్ చేశారు. ఫినాలే ఎపిసోడ్ అంతా కూడా బాగా చేశారు. కాని ఎప్పుడైతే అఖిల్ చేయిని విసిరికొట్టిన సమయంలో నాకు బాధగా అనిపించింది. అలా చేసి ఉండకూడదు అంటూ దుర్గ వ్యాఖ్యలు చేశారు. నెటిజన్స్ కూడా నాగార్జున తీరును ట్రోల్ చేశారు.
నాగ్ ఈ విషయమై ఏమైనా స్పందిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో నాగ్ స్పందిస్తే ఆయన హుందాతనం చాటుకున్న వారు అవుతారు.. అఖిల్ ను అవమానించడం తన ఉద్దేశ్యం కాదని నాగార్జున ఒక్క చిన్న మాట అంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నాగ్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.