Begin typing your search above and press return to search.
నాగ్ పాట బాగానే ఉంది కాని...
By: Tupaki Desk | 24 July 2016 5:52 AM GMTచాలామంది స్టార్ హీరోలు ఏదో సమయంలో సాంగు సింగేస్తున్నారు. దానికతోడు మ్యూజిక్ డైరక్టర్లు కూడా ఎంకరేజ్ చేయడంతో.. చాలామంది హీరోలు ఒక్కసారి స్వరాన్ని సరిచేసుకుని అభిమానులను అలా అలా అలరిస్తుంటారు. ఇప్పుడు నాగార్జున టైమ్ వచ్చింది.
ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ''నిర్మాలా కాన్వెంట్'' సినిమాలో 'కొత్త కొత్త బాష' అంటూ ఏ.ఆర్.రెహ్మాన్ కొడుకు ఏ.ఆర్.అమీన్ పాడిన పాట ఉంది చూశారూ.. దానికి నాగ్ తనదైన వర్షన్ లో పాడేశాడు. ఈ పాట వీడియో చూస్తే బాగానే కిక్కిచ్చింది. సీనియార్టీ ఎంత పెరుగుతున్నా కూడా యూత్ టైపులో నాగ్ డ్రెస్సింగ్ అండ్ ఆటిట్యూడ్ అదిరాయ్. కాని పాట దగ్గరకు వచ్చేసరికి.. రాగాలు తీయడం తనకు రాదని తెలుసు కాబట్టి.. చాలా చోట్ల హమ్మింగ్ తో పాటను ఫినిష్ చేశాడు నాగ్.
కాకపోతే తమన్ వంటి కంపోజర్ అయితే.. వాయిస్ ప్రాసెసింగ్ చేసి.. ఎవరు పాడిన పాటనైనా కూడా మెలోడియస్ గా మార్చేస్తాడు. ఇక్కడ మాత్రం సంగీత దర్శకుడు రోషన్ సాలూరి ఆ విషయంలో నాగ్ స్వరాన్ని చాలా ఒరిజినల్ గా వదిలేయడం వలన.. సాంగులో ఫీల్ కాస్త మిస్సయ్యిందే అని అనిపించక మానదు. అయినాసరే.. ఈ వయస్సులో కూడా ఇలాంటి ఎటెంప్ట్ చేసినందుకు నాగ్ ను అభినందించాల్సిందే.