Begin typing your search above and press return to search.
నాగ్ భారం దించేసుకున్నాడు
By: Tupaki Desk | 4 Oct 2015 10:30 PM GMTఆకాశ వీధిలో - ఢమరుకం లాంటి సినిమాల తర్వాత మళ్లీ నాగార్జునను బాగా ఇబ్బంది పెట్టిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఐతే ఇంతకుముందు సినిమాల నేపథ్యం వేరు.. పైగా అవి భారీ బడ్జెట్ చిత్రాలు కాబట్టి.. వాటికి నిర్మాత కూడా తాను కాదు. కాబట్టి తన చేతుల్లో ఏమీ లేదు. కానీ నాగ్ స్వీయ నిర్మాణంలో మొదలుపెట్టిన ‘సోగ్గాడే చిన్నినాయన’ తనకు తలపోటు తెచ్చిపెట్టింది. షూటింగ్ చేశాక ఔట్ పుట్ బాలేదంటూ రెండుసార్లు ఆ సినిమాను ఆపాల్సి వచ్చింది. స్క్రిప్టుకు రిపేర్లు చేసి రీషూట్ చేయాల్సి వచ్చింది. ఐతే ఎలాగైతేనేం మొత్తానికి సినిమా అయితే పూర్తి చేసేశాడు నాగ్. మొన్నే రీషూట్ చేస్తున్నట్ల.. సినిమా ఆలస్యమవుతున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. ఇంతలోనే సినిమా పూర్తయినట్లు స్వయంగా నాగార్జునే ప్రెస్ నోట్ ఇచ్చాడు.
ఈ సందర్భంగా సినిమా గురించి నాగ్ చెబుతూ.. ‘‘ఫస్ట్ టైం ‘సొగ్గాడే చిన్నినాయనా’ వంటి ఫుల్ కామెడీ మూవీ చేస్తున్నాను. సొగ్గాడిగా, అమాయకుడిగా రెండు వేరియేషన్లున్న క్యారెక్టర్లు ఈ చిత్రంలో చేస్తున్నాను. విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో తండ్రి పాత్ర దెయ్యం గా కనిపిసిస్తుంది. చనిపోయిన తర్వాత కొడుక్కి మాత్రమే కనబడే విచిత్రమైన క్యారెక్టర్ అది. ఈ పాయింట్ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రెండు క్యారెక్టర్లను బేస్ చేసుకుని ‘సొగ్గాడే చిన్ని నాయనా’ అనే టైటిల్ పెట్టాం. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మంచి రచయిత కూడా. అతను చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఒరిజినల్ స్టోరీ లైన్ ఉయ్యాలా జంపాలా నిర్మాత రామ్మోహన్ ఇచ్చారు. కళ్యాణ్ ఆ పాయింటుని బాగా డెవలప్ చేశాడు. ఇటీవల మైసూర్ లో భారీ షెడ్యూల్ చేశాం. దీంతో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మంచి రిలీజ్ డేట్ చూసి ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం” అని నాగ్ చెప్పాడు.