Begin typing your search above and press return to search.
తారక్ నుంచి నేర్చుకో అఖిల్!- కింగ్
By: Tupaki Desk | 19 Jan 2019 5:17 PM GMTఅక్కినేని నాగార్జున ఎన్నడూ లేనంత ఎమోషనల్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. నాగార్జున వారసుడిగా అఖిల్ టాలీవుడ్ లో పెద్ద రేంజు కెరీర్‌ని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం చాలా సీరియస్ గానే శ్రమిస్తున్నాడు అఖిల్. అతడి సినిమాల విషయంలో నాగార్జున కేరింగ్ అంతే గొప్పది. అఖిల్ నటిస్తున్న ప్రతి సినిమాని నాగార్జున స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తన కెరీర్ ని పూర్తి సేఫ్ స్టేజ్ కి తెచ్చే వరకూ నిదురించే సన్నివేశమే కనిపించడం లేదు.
ఇక నేటి సాయంత్రం జేఆర్ సీ సెంటర్ లో జరిగిన మిస్టర్ మజ్ను ట్రైలర్ ఈవెంట్ కి మజ్ను నాగార్జున అతిధిగా విచ్చేయడమే గాక ఎమోషనల్ గా మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చేసిన తారక్ ని ఉదహరిస్తూ.. అతడి నుంచి యాక్టింగ్ ని, మాస్ ని నేర్చుకో అంటూ తనయుడికి సూచించారు నాగార్జున. ``మా పెద్దబ్బాయ్.. పెద్ద పెద్దబ్బాయ్ తారక్.. తను నన్ను చాలా ఆప్యాయంగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాడు. సంతోషం అనిపిస్తుంది. అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ .. మాస్..`` అని అన్నారు. అఖిల్ వైపు తిరిగి.. రేయ్ .. మాస్ నేర్చుకోరా అక్కడ!! అంటూ నాగార్జున కోరడం విశేషం.
నిర్మాత బివిఎస్.ఎన్ గురించి మాట్లాడుతూ.. మగధీర (సహనిర్మాత), అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు బివిఎస్ఎన్. ఆయన ఈ సినిమాతో మరో హిట్ కొడుతున్నారు. ఈ బ్యానర్ లో అఖిల్ సినిమా చేయడం సంతోషంగా ఉంది..ఇక థమన్ తో అనుబంధం ప్రత్యేకమైనది. గంటసాల బలరామయ్య గారు.. నాన్నగారిని రైల్వేస్టేషన్ లో చూసి ఆర్టిస్టుగా పనికొస్తారని ఎన్నుకున్నారు. తమన్ తో భూభ్రమణంలా.. సర్కిల్ ఇలా కుదిరింది`` అని అన్నారు. దర్శకుడు వెంకీ గురించి మాట్లాడేస్తూ.. ``వెంకీ తెరకెక్కించిన తొలి ప్రేమ చూశాను.. లవ్ స్టోరికి ఏం కావాలో అన్నీ తనకు బాగా తెలుసు.. ఏడిపించడం.. నవ్వించడం.. ఎమోషన్ అన్నీ తెలిసిన దర్శకుడు. మజ్నులో కొన్ని సీన్లు చూశాను... చాలా బావున్నాయ్.. అని అన్నారు. ఈ మజ్ను టైటిల్ ఎవరిది? అంటే.. టైటిల్ నాన్నగారిది.. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చింది. అఖిల్ సినిమా ఆ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో అంత పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా.. అని నాగార్జున అన్నారు.