Begin typing your search above and press return to search.

అఖిల్ కి ఇన్ స్పిరేషన్ మెగాస్టార్ -నాగ్

By:  Tupaki Desk   |   13 Jun 2016 11:00 AM IST
అఖిల్ కి ఇన్ స్పిరేషన్ మెగాస్టార్ -నాగ్
X
సినీ'మా' అవార్డ్స్ లో ఉత్తమ డెబ్యూ యాక్టర్ గా అక్కినేని అఖిల్ కి అవార్డు దక్కింది. దీన్ని అందుకునేందుకు అఖిల్ రాకపోవడంతో.. అక్కినేని నాగార్జున ఈ అవార్డును స్వీకరించారు. కొడుకు తరపున అవార్డు తీసుకున్న నాగ్ మాట్లాడిన మాటలు.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

'అఖిల్ ఫస్ట్ ఫిలిం సరిగ్గా ఆడకపోయినా.. ఈ అవార్డ్ చిరంజీవి గారి చేతుల మీదుగా, రామ్ చరణ్ చేతుల మీదుగా... అంతటి ఇన్ స్పిరేషన్ చేతుల మీదుగా అవార్డ్ వస్తే అంత కంటే ఇంకేం కావాలి? ఈ అవార్డ్ వచ్చింది అనే కంటే ఎవరి చేతుల వచ్చిందో చెప్తాను అఖిల్ కి' అన్నారు నాగార్జున. నిజానికి అఖిల్ మొదటి మూవీ అఖిల్ డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అవార్డు ఫంక్షన్ లో ఈ మాటను ఒప్పుకునేందుకు చాలానే ధైర్యం కావాలి. అలాంటి గట్స్ ఉన్న రియల్ హీరో నాగార్జున.

ఆడినా ఆడకపోయినా.. ఎలా ఉన్నా సరే.. ఇదే బెస్ట్ అని ఊదరగొట్టే సినీ జనాలు ఉన్న అంత పెద్ద మూవీ ఫంక్షన్ లో.. తన కొడుకు మొదటి సినిమా సరిగ్గా ఆడలేదు అని నాగ్ చెప్పడం.. చాలామందిని మెస్మరైజ్ చేసింది. ఇలా ధైర్యంగా ఒప్పుకోగలిగేవారు, పైకి చెప్పగలిగేవారు ఇండస్ట్రీలో వేరెవరకూ కనిపించరనే కామెంట్స్ అక్కడే వినిపించాయి. ఏమైనా టాలీవుడ్ కింగ్ లో నిజాయితీ పాళ్లు బాగా ఎక్కువబ్బా!