Begin typing your search above and press return to search.

ఆర్జీవీని తన్నాల్సిన అవసరం లేదు -నాగ్

By:  Tupaki Desk   |   29 May 2018 4:08 AM GMT
ఆర్జీవీని తన్నాల్సిన అవసరం లేదు -నాగ్
X
ఈమధ్య వరసగా ఫ్యామిలీ ఎంటర్ టెయినర్లు ఎక్కువగా చేస్తూ వచ్చిన నాగార్జున ఉన్నట్టుండి యాక్షన్ జోనర్ వైపు టర్న్ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఏరికోరి ఆఫీసర్ సినిమా చేశాడు. జూన్ 1న ఆఫీసర్ థియేటర్లకు రానున్నాడు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. ఈ ఈవెంట్లో నాగ్ ఈ సినిమా స్పెషాలిటీ గురించి చెబుతూనే రామ్ గోపాల్ వర్మతో ఎంత హ్యాపీగా షూటింగ్ కంప్లీట్ చేసిందీ చెప్పుకొచ్చాడు.

‘‘రాము ఆఫీసర్ కథ చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యా. నమ్మిన నిజం కోసం పోరాడే పోలీస్ ఆఫీసర్ కథ నెరేట్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చేయడానికి అదో కారణం. సినిమా మొదలెట్టే ముందు రాము నాకో లెటర్ రాశాడు. అందులో కొన్ని బూతులూ ఉన్నాయ్. అవన్నీ చదవలేను. ఒకవేళ చెప్పింది చెయ్యకపోతే ఎక్కడో తన్నమని రాశాడు. కానీ రామును తన్నాల్సిన అవసరం లేదంటూ’’ ఆర్జీవీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని నాగ్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

‘శివ రిలీజయినప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తరవాత టెక్నాలజీ ఎంత పెరిగినా సౌండ్ సినిమాను ముందుకు తీసుకెళ్లేలా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి సినిమా వస్తోందని నమ్మకంతో చెబుతున్నా. ఇందులో యాక్షన్ సీన్స్ వయొలెంట్ గా ఉండవు. బ్రూటల్ గా ఉంటాయి. ఒక ఇద్దరు పగ ఉన్న మనుషులు కలబడిపోయినట్టే ఉంటాయి. క్లయిమాక్స్ చివరి 20 నిమిషాలు అదిరిపోతుంది. చాలా రోజుల తరవాత ఓ రియల్ ఇంటెన్స్ యాక్షన్ మూవీ రాబోతోంది. జూన్ 1కి పిడికిలి బిగించండి’’ తన మాటలతో అభిమానుల్లో నాగ్ జోష్ నింపాడు.

‘‘తెలుగు ఇండస్ట్రీ శివ సినిమాకు ముందు.. శివ తరవాత అంటూ ఉంటారు. శివ సినిమా రామ్ గోపాల్ వర్మకు బ్రేక్ ఇచ్చింది. కానీ నాకు మాత్రం అమలను ఇచ్చింది. ఈ విషయం ఎప్పుడూ చెప్పాలనుకుంటా. ఇంత ఏజ్ వచ్చినా యంగ్ గా ఎలా ఉన్నారని అంతా అడుగుతుంటారు. ఆ ఏజ్ గురించి మానేయండయ్యా బాబూ.. ఐయామ్ స్టిల్ యంగ్’’ అంటూ మన్మథుడు నాగ్ చెప్పిన మాటలకు ఆడిటోరియంలో నవ్వులు విరబూశాయి.