Begin typing your search above and press return to search.

మళ్లీ హలోబ్రదర్ ఫన్ గ్యారంటీ -నాగార్జున

By:  Tupaki Desk   |   26 Dec 2015 9:11 AM IST
మళ్లీ హలోబ్రదర్ ఫన్ గ్యారంటీ -నాగార్జున
X
సోగ్గాడే చిన్ని నాయన.. టాలీవుడ్ లో మోస్ట్ అవెయింటింగ్ మూవీ. మనం తర్వాత నాగార్జున హీరోగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఎంతో ఇష్టపడి, బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుని, అవసరమైతే రీషూట్స్ చేసి మరీ సోగ్గాడే చిన్ని నాయనను ఫినిష్ చేశాడు నాగ్.

తనదైన స్టైల్ లో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి మరీ.. లైవ్ థియేట్రికల్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు నాగార్జున. సంక్రాంతి పండుగ స్పెషాలిటీ చెప్పి మరీ.. 'సంక్రాంతికి వస్తున్నా.. కొడుతున్నాం' అంటూ పొంగల్ రిలీజ్ ని కన్ఫాం చేసేశాడు. స్టేజ్ పై ఉన్నంతసేపూ బంగార్రాజు స్టైల్ డైలాగ్స్ తో, అదే మాడ్యులేషన్ తో మాట్లాడ్డం విశేషం. అసలు ఈ మూవీపై నాగార్జున కాన్ఫిడెన్స్ లో.. హిట్ కొట్టడం కన్ఫాం అని అర్ధమయిపోయింది చాలామందికి. ఇప్పుడు నాగ్ అనౌన్స్ మెంట్ తో సంక్రాంతి రేస్ లో అఫీషియల్ గా జాయిన్ అయింది సోగ్గాడే చిన్ని నాయన.

ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కొన్ని ఆసక్తికరమైన మాటలతో ఇండస్ట్రీలో కొత్తవారిలో జోష్ నింపాడు నాగ్. 'నా దగ్గర ట్యాలెంట్ ఉంది అని బుక్ పట్టుకొచ్చిన ఎవరినీ నేను నిరుత్సాహపరచలేదు. అలా వచ్చిన వాడే ఈ సోగ్గాడే చిన్ని నాయన తీసిన కళ్యాణ్ కృష్ణ కూడా. ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు' అంటూ ఆశీర్వదించాడు. మరోవైపు ఆడియో రిలీజ్ కి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కు థ్యాంక్స్ చెబుతూనే.. ఈ మధ్యే తన తల్లి చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని బాథపడ్డాడు.

మొత్తం మీద సోగ్గాడు సిత్రాలతో సంక్రాంతికి అక్కినేని ఫ్యాన్స్ కి పండగే అని అనౌన్స్ చేయడమే కాదు.. మరోసారి హలో బ్రదర్ ఎంటర్టెయిన్మెంట్ గ్యారంటీ అని గ్యారంటీ కూడా ఇచ్చాడు నాగ్.