Begin typing your search above and press return to search.
మాది 18 నెలల కాపురం అండ్ ప్రెగ్నెన్సీ: 'కింగ్' నాగ్
By: Tupaki Desk | 2 March 2021 7:30 AM GMT'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వైల్డ్ డాగ్''. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మోన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నాడు. దియా మీర్జా - సయామీ కేర్ - అతుల్ కులకర్ణి - ఆలీ రెజా - బిలాల్ హుస్సేన్ - ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు. 'వైల్డ్ డాగ్' చిత్రాన్ని కరోనా లాక్ డౌన్ సమయంలో ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు రిలీజ్ హక్కులు అమ్మిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకున్న మేకర్స్.. ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘వైల్డ్ డాగ్' ప్రెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించారు. ''వైల్డ్ డాగ్ చిత్రాన్ని కరోనా లాక్ డౌన్ లో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్న మాట వాస్తవమే. అయితే సంక్రాంతికి క్రాక్ మరియు ఫిబ్రవరిలో ఉప్పెన సినిమాల సక్సెస్ తో మా ఆలోచన మారింది. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని ఏప్రిల్ 2న థియేటర్స్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా కాదు. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన కథ. బాంబ్ బ్లాస్ట్స్ చేసిన వారిని పట్టుకునే వైల్డ్ డాగ్ టీమ్ కథ. ఈ సినిమాతో మాది 18 నెలల కాపురం మరియు ప్రెగ్నెన్సీ కూడా. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మేమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుంది. అందుకే థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాం'' అని కింగ్ నాగ్ చెప్పుకొచ్చారు.