Begin typing your search above and press return to search.
స్విస్ నుంచి చిరుతలా దిగిన కింగ్
By: Tupaki Desk | 2 July 2019 4:47 AM GMTకింగ్ ఈజ్ బ్యాక్. నాగార్జున హైదరాబాద్ లో అడుగుపెట్టారు. స్విట్జర్లాండ్ లో `మన్మధుడు 2` చిట్ట చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుని ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టారు. అయితే నాగ్ విమానాశ్రయంలో అడుగు పెట్టిన తీరు.. ఆయన స్టైల్ ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్.
60 వయసుకు చేరువవుతున్న కింగ్ ఈ రేంజులో మెయింటెయిన్ చేయడంపై యువతరంలో ఒకటే హాట్ టాపిక్ గా మారింది. స్టైల్ అన్న పదానికే అతడు నిర్వచనంగా మారారు. మన్మధుడు అన్న పేరుకు తగ్గట్టే పూర్తిగా కాలేజ్ బోయ్ లా మారిపోయి కింగ్ సర్ ప్రైజ్ ట్రీట్ ఇస్తున్నారు. ఇదివరకూ రిలీజైన మన్మధుడు 2 టీజర్ లో చిలక్కొట్టుడు కొట్టే లవర్ బోయ్ లా కనిపించి షాకిచ్చారు. ఆన్ లొకేషన్ అడవుల్లోనూ ఆయన జిమ్ చేస్తున్న ఫోటోలు- వీడియోలు ఎంత పెద్ద సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చాయో.. అంతకు మించి ఆయన లేటెస్ట్ లుక్ సర్ ప్రైజ్ ఇస్తోంది.
హైదరాబాద్ శంషాబాద్ లో నాగార్జున లుక్ అందరినీ ఆకర్షించింది. ఓ ప్రత్యేకమైన టీషర్ట్ తో ఆయన స్టైల్ గా విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. టీస్ పై డిజైన్ ఫెంటాస్టిక్. దానిపై రన్నింగ్ రేస్ లో ఉన్న చిరుత (లియోపార్డ్) ప్రింట్ ఆకట్టుకుంది. కాలేజ్ బోయ్స్ కి మాత్రమే పాజిబుల్ అనిపించే ఇలాంటి టీషర్ట్స్ తో నాగ్ కనిపించడం స్పెషల్ అనే చెప్పాలి. ఎట్టకేలకు `మన్మధుడు 2` చివరి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. మొన్ననే కథానాయిక రకుల్ ప్రీత్ స్విస్ షెడ్యూల్ ను ముగించి హైదరాబాద్ కి చేరుకుంది. లేటెస్ట్ గా నాగార్జున నగరానికి చేరుకున్నారు. తదుపరి నాగ్ రెండు మిషన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సి ఉంది. ఒకటి బిగ్ బాస్ సీజన్ 3.. రెండోది బంగార్రాజు. ఇవి రెండూ ఇప్పటికే ఆన్ లో ఉన్నాయి. బిగ్ బాస్ కొత్త సీజన్ కి నాగార్జున హోస్టింగ్ అనగానే అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ పెరిగింది. ఆ అంచనాల్ని అందుకునేలా హోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఎన్టీఆర్.. నాని హోస్టులుగా రెండు సీజన్లు ఆకట్టుకున్నాయి. నాగార్జున హోస్టింగ్ లో టీఆర్పీ మరింత పెరుగుతుందని స్టార్- మా భావిస్తోంది. మరోవైపు కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే బంగార్రాజు స్క్రిప్టు పూర్తి చేసి నాగ్ రాక కోసం ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించాల్సి ఉంటుంది.