Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ సీజన్ రద్దు ప్రచారంలో నిజమెంత?
By: Tupaki Desk | 19 July 2020 2:30 AM GMTబిగ్ బాస్ సీజన్ 4 గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే స్టార్ మా వాళ్లు పార్టిసిపెంట్స్ ఎవరో ఫైనల్ చేసేశారని 40 మందిలో నలుగురు హీరోలు కూడా ఈసారి బిగ్ బాస్ ఇంట్లో సందడి చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ ఆగస్టులో సీజన్ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అలాగే నాగార్జున ఈ కొత్త సీజన్ కి హోస్టింగ్ చేస్తారన్న ప్రచారం కూడా వేడెక్కించింది.
అయితే ఇందులో నిజానిజాలెంత? అంటే.. ఇప్పటికే హోస్ట్ గా నాగార్జున ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇప్పుడే షూటింగ్ అంటే మాత్రం ఆయన అంగీకరించడం లేదట. అసలే కరోనా మహమ్మారీ విజృంభిస్తోంది. సన్నివేశం రిస్కీగా మారింది. ఇంటి సభ్యుల్లో ఒకరికి లక్షణాలు తెలియకుండా బయటపడినా అందరికీ అది ఎంతో ఇబ్బందికరం. అందుకే వైరస్ ప్రభావం తగ్గేవరకూ కాస్త వేచి చూడాలని సూచించారట. జూలై నాటికే ఈ సీజన్ ప్రారంభం కావాల్సి ఉన్నా ఆలస్యం కావడానికి హోస్ట్ నిర్ణయం కూడా ఒక కారణం అని వినిపిస్తోంది.
కింగ్ ఓవైపు సినిమా షూటింగ్ లను వాయిదా వేసుకున్నారు. అంతేకాదు బుల్లితెర షూటింగుల విషయంలోనూ కచ్ఛితత్వంతో ఉన్నారట. ఇక ఇంటి సభ్యుల ఎంపిక కూడా జూమ్ మీటింగ్స్ ద్వారా పూర్తవుతున్నాయని .. ఒప్పందాలకు వీడియో రికార్డింగులే బెస్ట్ అని నాగ్ సూచించారట. మహమ్మారీ శాంతించే వరకూ అనవసరంగా కంగారు పడొద్దని.. రిస్క్ అనుకుంటే సీజన్ నే క్యాన్సిల్ చేయాలని స్టార్ మా వాళ్లకు చెప్పేశారట. అంటే ఇప్పట్లో ఇదేదీ కుదిరే పని కాదు. మునుముందు ఇంకా కేసులు పెరుగుతున్నాయే కానీ తగ్గే సీన్ కనిపించడం లేదు. ఆ క్రమంలోనే 60 ప్లస్ నాగార్జున సూచనలు విలువైనవేననడంలో ఎలాంటి సందేహం లేదు.