Begin typing your search above and press return to search.
అఖిల్ కు నాగార్జున ఇచ్చిన సలహా
By: Tupaki Desk | 20 Dec 2017 9:55 AM GMT‘హలో’ సినిమాకు తన తండ్రి అక్కినేని నాగార్జునతో కలిసి పని చేయడం వల్ల తాను చాలా విషయాలు నేర్చుకున్నానని అంటున్నాడు అఖిల్. ఈ సినిమా ప్రొడక్షన్ అంతా చాలా వరకు తానే చూసుకునేలా తన తండ్రి బాధ్యత అప్పగించాడని.. దీంతో తనకు చాలా విషయాలు తెలిశాయని అఖిల్ చెప్పాడు. ఈ సినిమా మేకింగ్ సందర్భంగా తనకు తన తండ్రి ఒక సలహా ఇచ్చాడని.. అది తనకు ఆయన ఇచ్చిన బెస్ట్ సజెషన్ అని.. దాన్ని జీవితాంతం గుర్తుంచుకుని.. ఫాలో అవుతానని అఖిల్ అన్నాడు. ఇంతకీ ఆ సలహా ఏంటంటే..
‘‘ఒక సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయ్యాక 45 రోజుల ముందు షూటింగ్ పూర్తయ్యాలా ప్లాన్ చేసుకోవాలని నాన్న నాకు చెప్పారు. ఎప్పటికీ దీన్ని ఫాలో అవమని అన్నారు. ఇది నాకు ఆయనిచ్చిన బెస్ట్ సలహా. 45 రోజుల ముందే షూటింగ్ అయిపోతే.. ఏవైనా లోటు పాట్లు ఉంటే కరెక్షన్లు చేసుకోవచ్చు. రీషూట్లు కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా షూటింగ్ ముగిస్తే.. ఏదైనా తేడా ఉన్నా ఏం చేయలేం. ప్రమోషన్ల హడావుడిలో పడి ఔట్ పుట్ విషయంలో రాజీ పడిపోతాం. అవసరమైతే రిలీజ్ డేట్ మార్చుకుని అయినా లోటు పాట్లుంటే సరిదిద్దుకోవాలి కానీ.. అలాగే వదిలేయకూడదని నాన్న అంటారు. అందుకే రిలీజ్ డేట్ కు 45 రోజుల ముందే షూటింగ్ ముగించి.. ఔట్ పుట్ చూసుకోమని ఆయన చెబుతారు’’ అని అఖిల్ చెప్పాడు. ‘సోగ్గాడే చిన్నినాయనా’.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సినిమాలకు ఒకసారి షూటింగ్ అయ్యాక చూసుకుని మార్పులు చేర్పులు చేయించాడు నాగ్. ‘హలో’ విషయంలోనూ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయలేదని విక్రమ్ కుమార్ ను నాగ్ సున్నితంగా మందలించినట్లుగా వార్తలొచ్చాయి.