Begin typing your search above and press return to search.

వైష్ణ‌వ్ తేజ్ తో సినిమా చేస్తున్నాః నాగార్జున

By:  Tupaki Desk   |   1 April 2021 9:12 AM GMT
వైష్ణ‌వ్ తేజ్ తో సినిమా చేస్తున్నాః నాగార్జున
X
టాలీవుడ్ కింగ్ నాగార్జున.. మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్ తో సినిమా చేయ‌బోతున్నారు. అయితే.. హీరోలుగా కాదు. వైష్ణ‌వ్ హీరో కాగా.. నాగ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఉప్పెన స‌క్సెస్ త‌ర్వాత వెంట‌నే వైష్ణ‌వ్ తో నాగార్జున అగ్రిమెంట్ కుదుర్చుకున్నార‌నే ఊహాగానాలు వినిపించాయి. అడ్వాన్స్ కూడా చెల్లించార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. తాజాగా నాగార్జున క‌న్ఫ‌ర్మేష‌న్ తో అవ‌న్నీ వాస్త‌వాలే అని తేలిపోయింది.

ఉప్పెన ఏ స్థాయి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమా వంద కోట్లు క‌లెక్ట్ చేసిందంటూ మేక‌ర్స్ పోస్ట‌ర్ రిలీజ్ చేసి మ‌రీ ప్ర‌క‌టించారు. ఈ స‌క్సెస్ తో అంద‌రి చూపూ వైష్ణ‌వ్ ప‌డింది. ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి ప‌లు బ్యాన‌ర్లు ముందుకు వ‌చ్చాయి. ఇందులో మొద‌ట‌గా.. నాగ్ అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి మూవీ రానుంది.

త‌న అప్ క‌మింగ్ మూవీ ‘వైల్డ్ డాగ్’ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు నాగ్‌. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో పార్టిసిపేట్ చేస్తూ సినిమాకు మంచి హైప్ తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే.. ఈ విషయం కూడా వెల్లడించారు. తాను మెగా వార‌సుడు వైష్ణ‌వ్ తేజ్ తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు కింగ్‌.

కాగా.. ఇప్ప‌టికే వైష్ణ‌వ్ తేజ్ వ‌ద్ద‌కు స్క్రిప్టు వెళ్లింద‌ని, అది చూసిన యంగ్ హీరో పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు టేక‌ప్ చేయ‌నున్న‌ట్టు నాగార్జున ప్ర‌క‌టించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని చెప్పారు. మ‌రి, అది ఎవ‌రు? జోనర్ ఏంటీ? అన్న‌ది చూడాలి.