Begin typing your search above and press return to search.

ఇందుకోసం 'వైల్డ్‌ డాగ్‌' చూడమంటున్న నాగార్జున

By:  Tupaki Desk   |   31 March 2021 7:30 AM GMT
ఇందుకోసం వైల్డ్‌ డాగ్‌ చూడమంటున్న నాగార్జున
X
నాగార్జునను ఆయన అభిమానులు మాస్‌ పాత్రలో స్టైలిష్‌ లుక్‌ తో చూడాలని కోరుకుంటూ ఉంటారు. కాని ఆయన మాత్రం వైల్డ్‌ డాగ్‌ వంటి విభిన్నమైన యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. అక్కినేని అభిమానులను ఈ సినిమా తో కన్విన్స్‌ చేసేందుకు దర్శకుడు సోలోమన్‌ చాలానే ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. సినిమా లో యాక్షన్‌ మాత్రమే కాకుండా నాగార్జున అభిమానులు కోరుకునే రొమాంటిక్‌ మరియు మాస్ సీన్స్‌ కూడా ఉంటాయని అంటున్నారు. బాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా వైల్డ్‌ డాగ్‌ లో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పుకొచ్చాడు.

నాగార్జున ఆ ఇంటర్వ్యూలో ఇంకా మాట్లాడుతూ.. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలను మించి స్క్రీన్‌ ప్లే మరియు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయని వాటి కోసం సినిమాను చూడవచ్చు అన్నాడు. సినిమాలోని నా పాత్ర మాస్‌ గా ఉండటంతో పాటు ఆకట్టుకునే విధంగా ఉంటుందని అలాగే సినిమా లో తన లుక్‌ చాలా స్టైలిష్‌ గా కూడా ఉంటుందని అంటున్నారు. అభిమానులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా సినిమా ను హాయిగా చూసి ఎంజాయ్‌ చేయవచ్చని నాగార్జున హామీ ఇస్తున్నాడు. ఇదేదో పూర్తిగా యాక్షన్‌ మూవీ అన్నట్లుగా కాకుండా మాస్‌ ఆడియన్స్‌ ను మెప్పించే ఎలిమెంట్స్ ఉండటంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ ను ఆకట్టుకునే రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని నాగార్జున అండ్‌ టీమ్‌ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.