Begin typing your search above and press return to search.
హిందీ ఘోస్ట్ కోసం నాగ్ ఆరాటం, ఏ హీరో చేయని పని..!
By: Tupaki Desk | 2 Oct 2022 6:33 AM GMTటాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు తో పాటు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇది హిందీ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే కథతో రూపొందింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో చెబుతున్నారు.
హిందీలో సినిమాను భారీగా పబ్లిసిటీ చేసి విడుదల చేయడం కంటే సింపుల్ గా అక్కడ విడుదల చేయడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుందనే అభిప్రాయం తో యూనిట్ సభ్యులు ఉన్నారట. అందుకే ది ఘోస్ట్ సినిమా నార్త్ పబ్లిసిటీ గురించి పెద్దగా శ్రద్ద పెట్టలేదు.
అక్కడ పబ్లిసిటీ లేకపోవడంతో అసలు సినిమా అక్కడ విడుదల అయ్యే పరిస్థితి ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హిందీ లో ది ఘోస్ట్ ను థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం చేశారు. అక్కడ బిజినెస్ కూడా దాదాపుగా పూర్తి అయ్యిందని తెలుస్తోంది.
మొదట ది ఘోస్ట్ సినిమాను హిందీలో విడుదల చేసేందుకు బయ్యర్లు ముందుకు రాలేదట. నాగార్జున తనకు ఉన్న సర్కిల్ ను ఉపయోగించి ది ఘోస్ట్ సినిమా ను హిందీలో మార్కెట్ చేశాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ది ఘోస్ట్ సినిమా ను హిందీలో విడుదల చేయడం కోసం నాగార్జున అక్కడి డిస్ట్రిబ్యూటర్ కి ఏ హీరో ఇవ్వని మాట ఇచ్చాడు అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేవలం నాగార్జున ఆరాటం వల్లే అక్కడ సినిమా విడుదల అవ్వబోతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యుల్లో అనధికారికంగా చర్చ జరుగుతోంది. నాగార్జునకు ది ఘోస్ట్ పై అంతగా నమ్మకం ఉండటం వల్లే ఏ హీరో ఇవ్వని విధంగా బయర్ కి హామీ ఇచ్చాడని అంటున్నారు. ఇప్పటికే సినిమాపై ఎక్కువ నమ్మకం పెట్టుకుని పారితోషికం కు బదులుగా ఏరియాల రైట్స్ ను ఉంచుకున్న విషయం తెల్సిందే. మరి నాగ్ సర్ నమ్మకం ఎంత వరకు నిలుస్తుందో చూడాలి.