Begin typing your search above and press return to search.
ఆ రిజల్ట్ చూసి భయపడిన నాగ్
By: Tupaki Desk | 9 Oct 2022 10:30 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలు చాలావరకు రీమేక్ సినిమాలతోనే గట్టెక్కుతున్నారు అనే కామెంట్లు అయితే చాలానే వస్తున్నాయి. ఇక అక్కినేని నాగార్జున ఇటీవల కాలంలో అయితే రీమేక్ సినిమాలు చేసింది చాలా తక్కువ. కానీ ఆయన మళ్ళీ ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ తో ట్రాక్ లోకి రావాలి అని చూస్తున్నాడు. అందుకే ఏదైనా మంచి రీమేక్ స్టోరీ చేయాలి అని కూడా కొంతమందితో చర్చలు జరిపాడు.
ఇక గత ఏడాది వరకు అయితే నాగార్జున ఒక తమిళ సినిమాను రీమేక్ చేయాలి అని ఒరిజినల్ దర్శకులతో కూడా దీర్ఘంగానే చాలా జరిపాడు. కానీ ఇప్పుడు మాత్రం అతడు ఆ విషయంలో ఒక్కసారిగా వెనక్కి తగినట్లుగా తెలుస్తోంది. నాగార్జున రీమేక్ చేయాలి అనుకున్నది మరేదో కాదు తమిళంలో మాధవన్ విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ వేద అని తెలుస్తోంది. ఈ సినిమాను ఇటీవల హిందీలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించగా ఒరిజినల్ దర్శకులు పుష్కర్ గాయత్రి ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చారు. తప్పకుండా హిందీలో ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ సినిమా క్యారెక్టర్స్ హిందీ ఆడియో కు అంతగా కెనెక్ట్ కాలేదు. ఈ సినిమా కోసం అంతా కలిపి దాదాపు 150 కోట్ల వరకు ఖర్చు చేశారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం అందులో సగం కూడా రాలేదు. అయితే నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా మాత్రం నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
నాగార్జున కూడా ఈ సినిమాను రీమేక్ చేయాలని గత ఏడాది వరకు అనుకున్నాడు. కానీ ఇప్పుడు హిందీలో ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత ఆయన వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పుష్కర్-గాయత్రి కూడా ఈ సినిమాను మళ్ళీ తెలుగులో రీమేక్ చేయాలని ఆలోచన కూడా లేరట. ఇప్పటికే రెండుసార్లు రీమేక్ చేసి బోర్ కొట్టేసినట్లు ఉంది అనే ఆలోచనతో వెలుకడుగు వేసినట్లు సమాచారం. ఇక నెక్స్ట్ నాగ్ వందవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.