Begin typing your search above and press return to search.
రాజ్ తరుణ్ నష్టాలను తీరుస్తాడా?
By: Tupaki Desk | 8 Jan 2018 5:18 AM GMTకింగ్ నాగార్జున ఒకసారి అలోచించి స్కెచ్ వేశారంటే దాదాపు సినిమా హిట్టయినట్టే అనేలా చేస్తారు. సినిమా తెరకెక్కిన విధానం బట్టి సినిమా ఎంతవరకు హిట్ అవుతుంది అనే విషయాన్ని ముందే చెప్పగలరు. కానీ ఈ సారి ఆయన ఆలోచనలకు విరుద్ధంగా హలో సినిమా దారుణమైన రిజల్ట్ ని చూపించింది. క్రిటిక్స్ పరంగా ఆ సినిమా బాగానే ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ అయ్యింది. అఖిల్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంటాడు అనుకుంటే రెండవసారి కూడా ఫెయిల్యూర్నే అందుకున్నాడు.
ఆ సినిమా నిర్మాత నాగార్జునకు గాని అలాగే పంపిణీదారులు ఏ మాత్రం ప్రాఫిట్స్ ను అందించలేకపోయాయి. ఎక్కువగా పంపిణీదారులే నష్టాలను చూడాల్సివచ్చింది. అయితే ఎంతో కొంత నష్టాలను కవర్ చేసే విధంగా ఆదుకోవాలని ఇటీవల నాగార్జునని డిస్ట్రిబ్యూటర్లు కలిశారట. అయితే నాగార్జున రంగుల రాట్నం సినిమా రేట్స్ ను తగ్గించి ఎక్కువ నష్టపోయిన పంపిణీదారులకు రిలీజ్ చేసుకోమన్నాడట. ఎందుకంటే వారి ప్రొడక్షన్ లోనే ఆ సినిమా తెరకెక్కింది. అయితే అఖిల్ సినిమా రేట్ కొంచెం ఎక్కువని అందరికి తెలిసిందే.
కానీ రాజ్ తరుణ్ మార్కెట్ ఆ స్థాయిలో ఉంటుందా?. ఒకవేళ కలెక్షన్స్ వస్తే ఎంతవరకు హలో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను ఇస్తుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అసలే పవన్ బాలయ్య సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే పండగ సీజన్ లో చిన్న సినిమాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. థియేటర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక రంగుల రాట్నం గనక మంచి టాక్ లభిస్తే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. మరి హలో ఇచ్చిన నష్టాలను రాజ్ తరుణ్ తీరుస్తాడో లేదో చూడాలి.