Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ కు నాగ్ ఇచ్చిన కండీషన్స్ లిస్ట్
By: Tupaki Desk | 24 July 2020 1:00 PM GMTతెలుగు బిగ్ బాస్ గురించి గత నెల రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా చాలా మంది ఉందా లేదా అనే అనుమానంతో ఉన్నారు. ఎట్టకేలకు ఆగస్టు చివర్లో బిగ్ బాస్ ఉండబోతుందని స్టార్ మా వర్గాల ద్వారా క్లారిటీ వచ్చింది. వచ్చే నెల చివరి వరకు వ్యాక్సిన్ రావడం లేదంటే కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అందుకే ఆగస్టు 30 నుండి షూటింగ్ మొదలు పెట్టాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ జాబితా దాదాపుగా పూర్తి అయ్యింది. నాగార్జున మరోసారి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.
నాగార్జున వయసు ఆరు పదుల వయసు దాటింది కనుక ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆరు పదుల వయసు దాటిన వారికి కరోనా ఎక్కువ ప్రమాదకారి అంటూ వైధ్యులు హెచ్చరిస్తున్న కారణంగా మొన్నటి వరకు బిగ్ బాస్ కు నాగ్ ఆసక్తి చూపించలేదు. కాని ఎన్నాళ్లంటూ ఇలా ఉంటామనుకున్న నాగ్ కొన్ని కండీషన్స్ తో హోస్టింగ్ కు ఓకే చెప్పాడు. షో కు గతంలో మాదిరిగా ఆడియన్స్ ను పెద్దగా రానివ్వడం లేదు.
కేవలం టెక్నికల్ క్రూ మాత్రమే ఉండబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పీపీఈ కిట్స్ ధరించడంతో పాటు ప్రతి గంటలకు మొత్తం సెట్ ను శానిటైజేషన్ చేయాలంటూ సూచించాడు. తన వద్దకు కేవలం తన వ్యక్తిగత మేకప్ ఆర్టిస్టు తప్ప ఎవరు రాకూడదన్నాడు. కనీసం పది ఫీట్స్ దూరంలో ఉండాలంటూ సూచించాడు. షూటింగ్ కు గతంలో మాదిరిగా వారంలో కేవలం ఒక్క రోజు మాత్రమే హాజరు అవుతానంటూ కండీషన్ పెట్టాడట. అలాగే ప్రతి ఒక్కరి హెల్త్ రిపోర్ట్ ను పరిశీలించి ఆ తర్వాత మాత్రమే వారిని తీసుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులకు తెలియజేశాడట.
ఇక నాగ్ షూటింగ్ కు వచ్చిన సమయంలో ఆయన ఆరోగ్యంను పర్యవేక్షించేందుకు ఒక డాక్టర్ ను కూడా సెట్ లో ఉంచాలంటూ నిర్వాహకులు నిర్ణయించుకున్నారట. మొత్తానికి అత్యంత జాగ్రత్తల మద్య నాగ్ హోస్టింగ్ చేయబోతున్నాడు. మరి లోనికి వెళ్లే కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటో మరి..!