Begin typing your search above and press return to search.
మాస్ రాజా పోయి క్లాస్ సోగ్గాడొచ్చే
By: Tupaki Desk | 22 Jan 2016 7:30 PM GMTమాస్ మహరాజ్ రవితేజతో దిల్ రాజు తీయాలని అనుకున్న మూవీ ఆగిపోయిందని ఇంతకు ముందే చెప్పేసుకున్నాం. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తీయాలని భావించిన ఈ మూవీకి "అప్పట్లో ఒకడుండేవాడు" అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు దిల్ రాజు. ఒకసారి ఈ నిర్మాత వైపు నుంచి కారణమైతే, మరోసారి హీరో వైపు నుంచి వచ్చిన సమస్యలు అడ్డుపడ్డాయి. మొత్తానికి వీరి కాంబినేషన్ మాత్రం అటకెక్కేసింది. అయితే, మొత్తం స్క్రిప్ట్ రెడీగా ఉన్న ఈ మూవీని సీనియర్ హీరోతో తెరకెక్కించేయాలని దిల్ రాజు ఫిక్స్ అయిపోయాడని తెలుస్తోంది.
స్క్రిప్ట్ ప్రకారం పూర్తి కామెడీ ఓరియెంటెడ్ అయిన ఈ మూవీని సోగ్గాడే చిన్ని నాయనతో సక్సెస్ సాధించి, క్లాస్ మాస్ లో తన పట్టు చూపించిన నాగార్జునతో చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడు. ఈ మేరకు ఇప్పటికే నాగ్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నాడని అంటున్నారు టాలీవుడ్ జనాలు. అయితే, ఈ వెంచర్ కి ఇంకా నాగ్ సై అన్నాడా, లేదా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉండగా.. ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రాజెక్ట్ ఆపకూడదన్నది దిల్ రాజు ఉద్దేశ్యంగా చెబుతున్నారు.
మొత్తానికి బెంగాల్ టైగర్ తో హిట్టు కొట్టి నెల గడిచిపోయినా.. రవితేజ సినిమా ఇంకా స్టార్ట్ కావడం లేదు. అయితే, ఇప్పటికే ఊపిరిని రిలీజ్ కి రెడీ చేసిన నాగ్ మాత్రం.. మరోసారి సోలో హీరోగానే సత్తా చాటేందుకు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.