Begin typing your search above and press return to search.
హీరోయిన్ విషయంలో చిరు - నాగ్ సేమ్ టు సేమ్
By: Tupaki Desk | 15 Sep 2018 7:12 AM GMTమెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ చిత్రంలో కాజల్ తో రొమాన్స్ చేసిన విషయం తెల్సిందే. తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి నటించిన కాజల్ తో చిరంజీవి నటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో తండ్రితో చేసిన హీరోయిన్స్ ఆ తర్వాత కొడుకుతో చేయడం మనం చూశాం, కాని మొదట కొడుకుతో, ఆ తర్వాత తండ్రితో చేసిన హీరోయిన్ కాజల్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ జాబితాలో అను ఎమాన్యూల్ చేరబోతుంది. ఇటీవలే ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో నాగచైతన్యతో కలిసి నటించిన ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్ త్వరలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
భారీ బడ్జెట్ తో - భారీ అంచనాల నడుమ తెలుగు మరియు తమిళంలో ధనుష్ మరియు నాగార్జునలు ఒక చిత్రంలో నటించబోతున్నారు. ధనుష్ స్వయంగా ఈ చిత్రంకు దర్శకత్వం వహించబోతున్నాడు. తన మామ రజినీకాంత్ తో చాలా కాలంగా కలిసి నటించాలని కోరుకుంటున్న ధనుష్ ఈ కథను రాసుకున్నాడట. అయితే కొన్ని కారణాల వల్ల రజినీకాంత్ కు ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు వీలు కలగడం లేదని, ఆ కారణంగానే నాగార్జునతో ఆ పాత్రను పోషింపజేయాలని ధనుష్ నిర్ణయించుకున్నాడు. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా ధనుష్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఈ చిత్రంలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా అధితిరావును ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అను ఎమాన్యూల్ ను కూడా ఈ భారీ ప్రాజెక్ట్ కు ఎంపిక చేసినట్లుగా తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అను ఎమాన్యూల్ ఎవరికి జతగా నటించబోతుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అదితిరావు ధనుష్ కు జోడీ అంటూ గతంలో ప్రచారం జరిగిన కారణంగా నాగార్జునకు జోడీగా అను ఎంపిక అయ్యి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. సంవత్సర కాలంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రంను త్వరలోనే పట్టాలెక్కించేందుకు ధనుష్ ప్రయత్నాలు చేస్తున్నాడు.