Begin typing your search above and press return to search.
నాగ్ పంచెకట్టు.. నాన్న గారి వాచ్చీ..
By: Tupaki Desk | 18 Dec 2015 5:30 PM GMTఇంతకుముందు చాలాసార్లు చాలా సినిమాల్లో పంచెకట్టు కట్టాడు అక్కినేని నాగార్జున. సినిమాలోని పాటల్లో కూడా పంచెతో మెరిశాడు. అయితే ఇప్పుడు మాత్రం 'సోగ్గాడే చిన్న నాయనా' కోసం కాస్త ముందుకెళ్లి నాన్న గారిని ఫాలో అవుతున్నా అంటున్నాడు మన్మథుడు. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టిట్ బిట్ మీ కోసం.
అలనాడు సినిమాల్లో హీరోలు ఎక్కువగా పల్లెటూరి కుర్రాళ్లే కాబట్టి.. మన ఎన్టీఓడు.. నాగేస్రావు.. కాంతారావ్.. చివరకు కృష్ణ కూడా చాలా సినిమాల్లో పంచెకట్టుతోనే నటించారు. వాళ్లు పంచెలు కట్టడంలో దిట్టలు. అయితే ఈ తరానికి పంచె గురించి డిజైనర్లు స్టయిలిస్టులే చెప్పి.. వారే వచ్చి కడితే తప్పించి.. పెద్దగా తెలీదనే చెప్పాలి. ఇకపోతే నాగ్ ఈ సినిమా కోసం చేస్తున్న డ్యూయల్ రోల్ లో.. ఒకటి సీనియర్ తండ్రి క్యారెక్టర్. పాత్రలో క్వాలిటీ రావాలని లెజండ్ ఏఎన్నార్ పాత సినిమాలను చూసి మరీ పంచెకట్టును ట్రై చేశారట. అంతేకాదు.. నాగ్ పెట్టుకున్న ఒక వాచ్ కూడా 1959లో తన తండ్రి కొనుక్కున్న చేతి గడియారం. సో.. వింటేజ్ లుక్ కోసం ఏకంగా ఏఎన్నార్ వదిలి వెళ్లిన వస్తువులనే వాడుతున్నారనమాట.
ఈ సినిమాలో ఏఎన్నార్ కు సంబంధించి ఇలాంటి స్మృతులు ఇంకా చాలా ఉన్నాయ్ అంటున్నాడు నాగ్. త్వరలోనే అవన్నీ తెలియజేస్తారట.