Begin typing your search above and press return to search.
ఫ్లాపులను లెక్కచేయకుండా ఫుల్ స్పీడులో సినిమాలు చేస్తున్న స్టార్ హీరో..!
By: Tupaki Desk | 6 April 2021 11:30 PM GMT'కింగ్' అక్కినేని నాగార్జున 'మన్మథుడు 2' ప్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ''వైల్డ్ డాగ్'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక నాగ్ 'PSV గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇటీవలే స్టార్ట్ అయిన ఈ మూవీ గోవాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో నాగార్జునకు జోడీగా స్టార్ హీరోయిన్ కాజల్ కిచ్లు నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం నాగ్ గడ్డంతో మేకప్ లేకుండా నటిస్తున్నాడని తెలుస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్ పై నారాయణదాస్ కె నారంగ్ - రామ్మోహనరావు - శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇకపోతే నాగార్జున ''బంగార్రాజు'' సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్ గా ఇది తెరకెక్కనుంది. ఇందులో నాగచైతన్య కూడా నటించనున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఇటీవల నాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతా అనుకున్న ప్రకారమే జరిగితే 'బంగార్రాజు' షూటింగ్ జూన్ లేదా జూలై నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు. అంతేకాదు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని కూడా తెలిపారు. ఆ లోపు ప్రవీణ్ సత్తారు సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తారేమో చూడాలి.
ఇక నాగార్జున చాలా గ్యాప్ తర్వాత హిందీలో నటిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర' మూడు భాగాలుగా విడుదల కానుంది. ఆర్కియాలజిస్టు పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ - అమితాబ్ బచ్చన్ - అలియా భట్ - మౌని రాయ్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి భాగంలో నాగ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో 'బ్రహ్మాస్త్ర' విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఈ విధంగా నాగ్ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఫుల్ స్పీడుతో సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు.