Begin typing your search above and press return to search.

ఏఎన్నార్ వాచీని నాగ్ ఏం చేశాడు?

By:  Tupaki Desk   |   22 Sept 2015 1:02 PM IST
ఏఎన్నార్ వాచీని నాగ్ ఏం చేశాడు?
X
ఏఎన్నార్ చివరి రోజుల్లో ‘మనం’ లాంటి మధురమైన సినిమాలో నటించి తన కుటుంబ సభ్యులకు మరపురాని అనుభూతిని మిగిల్చి వెళ్లారు. ఆయనకు ‘మనం’ సినిమా గ్రేట్ ట్రిబ్యూట్ గా నిలిచింది. ఏఎన్నార్ మరణానంతరం కూడా ఆయనకు గొప్ప నివాళి అందించే ప్రయత్నంలో ఉన్నాడు తనయుడు నాగార్జున. పల్లెటూరి పాత్రల్లో, పంచెకట్టులో కనిపించడం నాగేశ్వరరావుకు ఎంత మక్కువో తెలిసిందే. తన కొత్త సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనాలో’ అలాంటి పాత్రే పోషిస్తున్నాడు నాగ్.

సోగ్గాడే..లో ఇప్పటిదాకా బయటికి వచ్చిన నాగ్ పోస్టర్ లను గమనిస్తే ఆయనో వాచీ కట్టుకున్న సంగతి తెలుస్తుంది. ఆ వాచీకి ఓ ప్రత్యేకత ఉంది. అది నాగేశ్వరరావుదే. ఒమేగా కంపెనీకి చెందిన ఆ వాచీని ఏఎన్నార్ కొన్ని దశాబ్దాల పాటు వాడారు. తన తండ్రి జ్నాపకంగా తన దగ్గరే ఉంచుకున్న నాగ్.. ‘సోగ్గాడే’లో దసరా బుల్లోడి పాత్ర కోసం ఆ వాచీని కట్టుకోవడం విశేషం.

కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రస్తుతం మైసూర్ లో చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. సినిమా పూర్తయ్యే వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన రమ్యకృష్ణ - లావణ్య త్రిపాఠి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. తన సొంత బేనర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు నాగార్జున. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.