Begin typing your search above and press return to search.

హిట్టు కథ కోసం నాగార్జున వేట..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 10:39 AM GMT
హిట్టు కథ కోసం నాగార్జున వేట..!
X
సీనియర్ హీరో నాగార్జున కు అర్జెంట్ గా ఒక సూపర్ హిట్ కథ కావాలని తెలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతూ వస్తున్న నాగ్ ఈమధ్య ఆ జోరు తగ్గించాడు. బంగార్రాజు హిట్ పడినా అంతకుముందు సినిమాలు.. ఆ తర్వాత వచ్చిన ది ఘోస్ట్ కూడా ఫ్లాప్ అందుకున్నాయి. ప్రేక్షకులు తనని ఎలాంటి సినిమా చేయాలని భావిస్తున్నారో అర్ధం కాక నాగ్ కథల వేటలో పడినట్టు తెలుస్తుంది. హిట్టు సినిమా కథ కోసం నాగార్జున రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. రైటర్స్ అందరిని తనకు సూటయ్యే కథలను తీసుకు రమ్మని చెప్పినట్టు టాక్.

నాగార్జున లాంటి సీనియర్ హీరోకి కథల కొరత ఏర్పడటం విచిత్రంగా ఉంది. ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేస్తూ వచ్చే నాగార్జున ఈ మధ్య కథల సెలక్షన్స్ లో రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. అందుకే ఆ సినిమాల ఫలితాలు అలా ఉంటున్నాయి.

నాగార్జున నెక్స్ట్ సినిమా ప్రసన్న కుమార్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. నాగార్జున మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉంటుందని టాక్. నాగ్ కూడా ప్రేక్షకులు తనని ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తీస్తేనే చూస్తున్నారని ఫిక్స్ అయ్యారు. ప్రసన్న కుమార్ సినిమా తర్వాత కూడా మరో రైటర్ కథతో నాగార్జున సినిమా ఉంటుందని తెలుస్తుంది.

అన్నపూర్ణ బ్యానర్ లో ఇదివరకు మంచి కథలతో సొంత ప్రయోగాలు చేసే వారు నాగార్జున. ఇప్పుడు ఆ బ్యానర్ లో కూడా సినిమాలు తీయడం మానేశారు. ఎంటర్టైనర్ సినిమాలతోనే ఆడియన్స్ ని మెప్పించాలని ఫిక్స్ అయిన నాగ్ అలాంటి కథలతోనే రమ్మంటూ దర్శకులకు చెబుతున్నారట.

ఈ మధ్య కాలంలోనే పదుల సంఖ్యలో కథలు విన్నట్టు తెలుస్తుంది. వాటిలో రెండు కథలు నాగార్జునకు బాగా నచ్చాయట. త్వరలో ఆ సినిమాల ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.

ఇక ఇదే కాదు వేరే హీరోలతో మల్టీస్టారర్ కథలను కూడా నాగ్ కోరుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ నాగార్జున ఇదివరకే మల్టీస్టారర్స్ చేసినా యువ హీరోలతో కూడా తను నటిస్తానని చెబుతున్నారట. ప్రసన్న కుమార్ మూవీలో నాగార్జునతో పాటుగా అల్లరి నరేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటాడని తెలుస్తుంది. నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ హోస్ట్ గా కూడా నాగార్జున చేసే ఛాన్స్ లేదని టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.