Begin typing your search above and press return to search.
తెలుగు సినిమాను దత్తత తీసుకుంటానంటున్న నాగార్జున!
By: Tupaki Desk | 21 May 2021 8:30 AM GMTమొన్నామధ్య ఓ సినిమా ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతూ.. తన ‘ఖైదీ’ చిత్రాన్ని మేకర్స్ తనకు అంకితం ఇచ్చారని, కానీ.. ఆ సినిమాకు సంబంధించిన ప్రింట్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పారు. 40 సంవత్సరాల కిందటి సినిమాకే ఇలాంటి ఇబ్బంది వస్తే.. అంతకు ముందు వచ్చిన చిత్రాల సంగతేంటీ? అన్న ప్రశ్న రాకమానదు. ఇలాంటి ప్రశ్న నాగార్జునకు ఎప్పుడు వచ్చిందో తెలియదుగానీ.. తెలుగు సినిమాలన్నింటినీ భద్రపరిచే కార్యక్రమం తీసుకోబోతున్నారట.
ఈ మేరకు ఓ మూవీ మ్యూజియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. టాలీవుడ్లో వచ్చిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలను భద్రపరచడంతోపాటు.. ఆయా సినిమాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట నాగార్జున. ఆధునిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని, అందరూ గర్వించేలా ఈ మ్యూజియం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే డిజిటల్ యుగం వేగం అందుకున్నసంగతి తెలిసిందే. జనాలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా.. గూగుల్ చేయడమో, ఇంకో మార్గంలో ఆన్ లైన్లో వెతకడమో చేస్తున్నారు. అందువల్ల.. నాగార్జున కూడా డిజిటల్ మ్యూజియం అందుబాటులోకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారట. మరి, ఈ ప్రయత్నం ఎంత వరకు వచ్చింది? ఎప్పుడు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది అన్నది చూడాలి.