Begin typing your search above and press return to search.
సినిమా బాగుంటే అనరు.. అందుకే పట్టించుకోను: 'వైల్డ్ డాగ్' నాగ్ ఇంటర్వ్యూ
By: Tupaki Desk | 15 March 2021 7:31 AM GMTటాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'వైల్డ్ డాగ్'. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదలై సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాగ్ అండ్ వైల్డ్ డాగ్ టీమ్. ఆ ఇంటర్వ్యూలో నాగ్ అండ్ టీమ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. చూద్దాం!
*నాగ్ సార్ ఎలా అనిపిస్తుంది.. ట్రైలర్ రెస్పాన్స్ చూస్తుంటే?
చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రేక్షకులు ట్రైలర్ ను ఓన్ చేసుకున్నారు. ఇప్పటికే వ్యూస్ మిలియన్స్ చేరుకున్నాయి. ప్రొద్దునే లేచి యూట్యూబ్ చూసి వచ్చా.
*మీరు, మెగాస్టార్ కాంబోలో ఏది చేసినా హిట్ అవుతుంది. ఈసారి కూడా ట్రైలర్ మెగాస్టార్ లాంచ్ చేయడం.. అసలు ఏం జరిగింది?
నిజానికి ట్రైలర్ రాగానే నేను చూసి చిరంజీవి గారికి కాల్ చేసి చెప్పాను. మీకు ట్రైలర్ పంపించాను. చూసి నచ్చితే ట్విట్టర్ లో లాంచ్ చేయండి అని.. కానీ నాకు ట్రైలర్ నచ్చిన నచ్చకపోయినా నువ్వు నచ్చుతావ్ నాగ్.. ఖచ్చితంగా ఇప్పుడే ట్వీట్ చేస్తా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అలాగే ట్రైలర్ చూసి ఆయన కూడా చాలా బాగుంది. క్యూరియసిటీ పెంచుతుంది అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పడం హ్యాపీగా అనిపించింది.
*మరి మహేష్ బాబు గారిని ఎలా.. ఆ స్క్రీన్ షాట్..?
అయితే చిరుతో పాటు మహేష్ కు కూడా సెండ్ చేసాను. మహేష్ చాలా ఫాస్ట్. వితిన్ త్రి మినిట్స్ లో రిప్లై ఇచ్చాడు. ట్రైలర్ చూసి టెర్రిఫిక్ అనడంతో హ్యాపీ. అలాగే ఈ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ వాడుకోవచ్చా అన్నాను. వెంటనే ఎస్ అన్నాడు.
*ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ ఎలా ఉంది..?
నిజానికి మహేష్ చాట్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేయడం హ్యాపీగా ఉంది. ఎందుకంటే.. నా ద్వారా మహేష్ ఫ్యాన్స్ అతని వాట్సాప్ డీపీ చూసారు. వారంతా థాంక్స్ చెబుతూ యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీ.
*ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా.. మన హైదరాబాద్ గోకుల్ చాట్ నేపథ్యంలో తెరకేక్కిందని టాక్. అది నిజమేనా.. మీరు ఆ టైంలో ఎక్కడున్నారు?
*హ ఇక్కడే హైదరాబాద్ లోనే ఉన్నాను. ఆ ఇన్సిడెంట్ చాలా దారుణం. నేను ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజులకు ఆ ఏరియాకు వెళ్ళాను. మొత్తం బ్లాస్ట్ జరిగి చెల్లాచెదురుగా ఉంది. అంతమంది ప్రాణనష్టం జరగడంతో గుండె తరుక్కుపోయింది. నేను రెగ్యులర్ వెళ్లే ప్లేస్ అది. హైదరాబాద్ లో గోకుల్ చాట్ ఫేమస్.
*ఈ సినిమాను 70రోజులు 300 ప్లస్ లొకేషన్స్ లో షూట్ చేసారంట. ఎలా సాధ్యమైంది?
అవును. సగం టైం ట్రావెలింగ్ సరిపోయింది. నిజానికి కోవిడ్ తర్వాత లొకేషన్లకు వెళుతూ ఉంటే మాకు స్వతంత్రం వచ్చినట్లే అనిపించింది. కులుమనాలిలో షూట్ చేసాం. అక్కడే మంచు చలిలో షూట్ హార్డ్ గా నడిచింది. కానీ మేం హ్యాపీ.
*మనాలి నుండి అంత బిజీ షెడ్యూల్లో కూడా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కోసం గిఫ్ట్స్ తెచ్చారు. సీసన్ 3 వాళ్లు ఏం చేశారు సార్?
ఐయామ్ సారీ తేలేకపోయాను. ఓన్లీ వీడియో కాల్ చేసాను.
*డైరెక్టర్ అహిశోర్ సాల్మన్ ఫస్ట్ ఫిల్మ్. ఎలా కుదిరింది?
సాల్మన్ నాకు ఊపిరి టైంలోనే రైటర్ గా తెలుసు. ఆల్రెడీ హిందీలో కూడా చేసాడు. నాకు ఈ కథ చెప్పగానే బాగా కనెక్ట్ అయిపోయాను. వెంటనే ఓకే చెప్పేశా. ఎందుకంటే అతను చాలా క్లియర్. అందుకే నమ్మాను.
*కొత్త డైరెక్టర్లకు నాగ్.. అవకాశాలు ఇస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి?
అలా సినిమా బాగుంటేనే అంటారు. సినిమా బాలేదనుకో.. ఎందుకు అనవసరంగా కొత్తవాళ్ళతో సినిమా చేయడం అంటారు. ఇవన్నీ వరసలు ఉంటాయి. పట్టించుకోకూడదు. ఐ ట్రస్ట్ హిమ్ అంతే!
*ఈ సినిమాలో ఓ బీప్ డైలాగ్ పెట్టారు. ఫస్ట్ టైం మీ నోటి నుండి..?
అది బీప్ డైలాగ్. అలాగే ఎన్ఐఏ ఆఫీసర్ డైలాగ్ అది. నిజంగా అలా పీపుల్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడతారు. మనం కూడా అంతే కదా. కోపం వస్తే మాట్లాడటం కామన్.
*ఈ సినిమాలో దియామీర్జా మీ భార్యగా నటించింది. ఫస్ట్ తెలుగు సినిమా తనకి.. ఆమె గురించి?
ఆమె క్యారెక్టర్ చిన్నదే కానీ చాలా ఇంపార్టెంట్. దియాది హైదరాబాదే. ఇక్కడే పుట్టిపెరిగింది. మిస్ ఇండియా అయ్యాక ముంబైకి షిఫ్ట్ అయింది.
*సినిమా ట్రైలర్ చూసి సమంత.. 'నాగ్ మామ యూ లుకింగ్ అమేజింగ్' అంటూ పోస్ట్ పెట్టింది. ఇంతకీ అమల గారు ఏమన్నారు?
అమల పది ముద్దుల ఎమోజిలు.. పది హార్ట్ ఎమోజిలు.. పది లవ్ ఎమోజిలు పెట్టింది.
*వైల్డ్ డాగ్ లో అసలు గడ్డం లేకుండా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ గడ్డం దేనికోసం సార్?
ఇది కొత్త సినిమా కోసం ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు.
*ఎన్ఐఏ ఏజెంట్ అంటున్నారు. బ్లాస్ట్, గన్స్.. ఇలా ఈ సినిమా సబ్జెక్టు ఎలా డీల్ చేశారు?
అవును. కానీ సాల్మన్ ఆల్రెడీ చాలా రీసెర్చ్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అసలు ఈ బ్లాస్ట్ వెనక ఏం జరిగింది. ఎవరున్నారు? అతని బాక్గ్రౌండ్ ఏంటి.. ఇలా అన్ని రీసెర్చ్ చేశారు. కానీ ఆ బ్లాస్ట్ వెనక ఉన్న అసలు వ్యక్తిని పట్టుకొని ఇండియాకు తీసుకురావడమే ఈ సినిమా కథ. క్యారెక్టర్లకు ఫిక్షనల నేమ్స్ పెట్టాము.
*యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు ఎలా.. ఏం జరిగింది?
నిజానికి ఈ సినిమాకు ఇద్దరు యాక్షన్ డైరెక్టర్స్ పనిచేసారు. డేవిడ్, శ్యామ్ కౌశిక్. అలాగే డైరెక్టర్ ఓ రియల్ ఆర్మీ మేజర్ ను కూడా ఈ సినిమాకోసం తీసుకొచ్చాడు.
*నాగ్ సార్ సినిమా అంటే సాంగ్స్ ఎక్సపెక్ట్ చేస్తారు. ఇందులో సాంగ్స్ లేవు?
ఇది వైల్డ్ డాగ్ సినిమా. ఓ వైపు టెర్రరిస్ట్ ఎటాక్ గురించి సినిమా నడుస్తుంటే మనం సాంగ్స్ పాడుకుంటూ కూర్చుంటే బాగోదు. అందుకే ఈ సినిమాలో లేవు.
*ట్రైలర్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. తమన్ ఎలా లైన్ లోకి వచ్చాడు?
తమన్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాలి. తనకు టైం లేకపోయినా చేసాడు. మేం ఎవరు ఎన్ని వెయిట్ చేస్తుండగా.. క్రాక్ సినిమా చూసాం. ఆ మూవీకి బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. వెంటనే తమన్ ఓకే అనుకున్నాం.
*ట్రైలర్ చూస్తుంటే ఇది కమర్షియల్ సినిమాలా లేదు?
కమర్షియల్ అంటే జనాలు ఎక్కువగా ఏది ఇష్టపడతారో అదే కమర్షియల్. ఒకప్పుడు సినిమాల్లో ఆరు పాటలు ఉండాల్సిందే అనేవారు. ఇప్పుడు అలా లేదు. ఒకటి రెండు సాంగ్స్ తో కూడా సినిమాలు వస్తున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ అనే ఫార్ములా పోయింది. సినిమాను సినిమాగా చూస్తున్నారు.
*ప్రొడ్యూసర్ నిరంజన్ గురించి..?
నిజానికి మా నిర్మాత నిరంజన్ అసలు వైల్డ్ డాగ్. చాలా డేర్. అతని సినిమాల సెలక్షన్స్ చూస్తేనే అర్ధమవుతుంది. చాలా ఇంటెలిజెంట్ ప్రొడ్యూసర్ ఆయన.
*ప్రేక్షకులకు వైల్డ్ డాగ్ గురించి ఏం చెబుతారు?
కొత్త జానర్ లో ట్రై చేసాం. అలాగని స్లోగా నడిచే సినిమా కాదు. ఫాస్ట్ గా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రియల్ ఇన్సిడెంట్స్ నుండి చేసాం కాబట్టి జనాలకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాం. చూడాలి ఏప్రిల్ 2న ప్రేక్షకులు ఏమంటారో. థాంక్యూ.